Curiosity నుంచి Confidence వరకూ… నా ITR Journey...
2022 జూన్ చివరి వారంలో… నాకు తిరుత్తణి నుంచి తిరుపతికి ట్రాన్స్‌ఫర్ వచ్చింది.
అదే సంవత్సరం జూలైలో… ఆగస్ట్ మొదటి వారంలో నేను, నా తమ్ముడు కలిసి నేపాల్ ట్రిప్‌కి వెళ్లే ముందు… ఒకరోజు మొదటిసారి తిరుపతిలో ఉన్న మా బంధువు, సీనియర్ ఆడిటర్ చంద్ర రెడ్డి అంకుల్‌ని కలిసి… నా తమ్ముడు Income Tax Return (ITR) filing గురించి మాట్లాడడానికి వెళ్లాం.
ఆ ఏడాది due date ఆగస్ట్ 31 వరకు extend కావడంతో… మేము ట్రిప్‌కి ముందు ఫైల్ చేయలేదు.
ఆగస్ట్ 13న (శనివారం) నేపాల్ ట్రిప్ నుంచి వచ్చాక… నేను, నా తమ్ముడు ఒకరోజు కలిసి మళ్లీ అంకుల్ ఆఫీస్‌కి వెళ్లాం.
సాధారణంగా salaried employees లాగా… TDS refund కోసం నా తమ్ముడు Form 16 మాత్రమే తీసుకెళ్లాం.
Form 16 తీసుకుని కంప్యూటర్‌లో వివరాలు చూస్తూ… అంకుల్ ఒక్కసారిగా ఒక ప్రశ్న అడిగారు:
“నీ పేరుమీద ₹10 లక్షల కంటే ఎక్కువ Fixed Deposits ఉన్నాయా?”
మేమిద్దరం ఒక్కసారిగా షాక్ అయ్యాం.
అంకుల్‌కి ఇది ఎలా తెలుసు?
నిజానికి… ఆ సమయంలో నా తమ్ముడు పేరుమీద ₹20 లక్షల FD లు ఉన్నాయి.
అవి మా parents అతని పేరుమీద పెట్టినవే.
ఆ FD ల నుంచి వచ్చే monthly interest కూడా వాళ్లే తీసుకునేవారు.
కానీ… అంకుల్ ఏ బ్యాంక్‌లో ఎంత fixed deposit ఉందో, interest ఎంత వస్తుందో అన్నీ చెప్పడం చూసి నాకు curiosity వచ్చింది.
అప్పుడే నేను అడిగాను —
“ఇది మీకు ఎలా తెలుస్తుంది అంకుల్?”
అప్పుడు అంకుల్ నాకు AIS (Annual Information Statement) గురించి చెప్పారు.
మన PAN card కి link అయ్యే ప్రతి financial transaction అందులో కనిపిస్తుందని చెప్పారు.
అప్పుడే నాకు Income Tax filing మీద మొదటిసారి ఆసక్తి కలిగింది.
తమ్ముడు ITR ఫైల్ అయిన తర్వాత… కొన్ని రోజులకు నేను కూడా అంకుల్ ఆఫీస్‌కి వెళ్లి… నా ITR మొదటిసారి ఫైల్ చేసాను.
2016 డిసెంబర్‌లోనే State Bank లో జాయిన్ అయినా… అప్పటివరకు నాకు TDS cut కాకపోవడంతో… ITR ఫైల్ చేయలేదు.
చివరికి 2022 ఆగస్ట్‌లో… మొదటిసారి నా ITR ఫైల్ చేసాను.
ఆ తర్వాత… 2023 జూలై, 2024 జూలైలో కూడా నేను, నా తమ్ముడు అంకుల్ దగ్గరే returns ఫైల్ చేసాం.
---
ప్రతి సంవత్సరం… అంకుల్ ఆఫీస్‌కి వెళ్లినప్పుడల్లా Income Tax గురించి ఏదో ఒక కొత్త విషయం నేర్చుకున్నాను.
గత సంవత్సరం… జూన్ 5న నా తమ్ముడు పెళ్లి రిసెప్షన్‌లో అంకుల్ నన్ను పలకరించి చెప్పారు:
“ఈసారి income tax filing కోసం తొందరపడాల్సిన అవసరం లేదు. Due date సెప్టెంబర్ 15 వరకు ఉంది… మెల్లగా రా.”
నేను ఆశ్చర్యపోయి అడిగాను — “ప్రతి సంవత్సరం చివర్లో date extend చేస్తారు… ఈసారి ముందే ఎందుకు ప్రకటించారు?”
అప్పుడు అంకుల్ — Income Tax Department లో Artificial Intelligence implement చేస్తున్నందున… ముందుగానే due date extend చేసి announce చేశారని చెప్పారు.
నేను — “సరే అంకుల్… ఆగస్ట్ మొదటి వారం వస్తాను” అన్నాను.
గత సంవత్సరం జూలైలో… నాకు Form 16 వచ్చింది.
ఒకరోజు sudden గా నాకు ఒక ఆలోచన వచ్చింది — “మనమే ITR filing ఎందుకు చేయకూడదు?”
మొదటిగా… ఒక చిన్న ప్రయత్నంగా నా ఫ్రెండ్ Naveen కి నేను స్వయంగా ITR ఫైల్ చేసాను.
అది successful అవ్వడంతో… ఆ రోజు నాకు చాలా హ్యాపీగా అనిపించింది 🙂
ఎందుకంటే… ఒకప్పటివరకు ITR filing అంటే auditors మాత్రమే చేస్తారు అనుకునేవాడిని.
కానీ 2022 నుంచి అంకుల్ దగ్గర doubts అడిగి తెలుసుకున్న తర్వాత… ఎవరికైనా ఇది సాధ్యమే అని అర్థమైంది.
ఆ తర్వాత… గత సంవత్సరం కనీసం 10 మంది ఫ్రెండ్స్ ITR లను నేను ఒక్కడినే ఫైల్ చేసాను.
అందరి filing అయిపోయిన తర్వాత… ఒకరోజు sweets box తీసుకుని అంకుల్‌ని కలవాలని అనుకున్నాను.
ఎందుకంటే… నాకు ఈ knowledge రావడానికి ముఖ్య కారణం ఆయనే.
ఆయనని కలిసి thanks చెప్పాలని అనుకున్నా… చివరికి అది కుదరలేదు.
---
రెండు వారాల క్రితం… నాకు తెలిసిన ఒక వ్యక్తి loan కోసం గత 2 సంవత్సరాల ITR ఫైల్ చేయాలని అడిగాడు.
Due date దాటిన ITR ఎలా ఫైల్ చేయాలి, ఏ section కింద ఫైల్ చేయాలి అన్నది నాకు తెలియక…
అంకుల్‌కి కాల్ చేసాను.
ఆయన — “ఆఫీస్‌లోనే ఉన్నాను, రా” అన్నారు.
ఆ రోజు సాయంత్రం… PS4 నుంచి Swiggy లో sweets box ఆర్డర్ చేసి వెళ్లాలని అనుకున్నా…
కుదరలేదు.
మరుసటి రోజూ కూడా కుదరలేదు.
చివరికి… అంకుల్‌కి ఇవ్వాలని అనుకున్న అర కేజీ స్వీట్స్ నేను ఒక్కడినే తిన్నాను 😄
---
ఈరోజు నాల్గవ శనివారం కావడంతో…
ITR అవసరమున్న వ్యక్తి కాల్ చేయడంతో… ఉదయం 11కి అంకుల్ ఆఫీస్‌కి వెళ్లాను.
అంకుల్ చాలా busy గా ఉన్నారు.
ఒక వ్యక్తి 2005లో ₹5 లక్షలకు కొన్న ఇల్లు… గత సంవత్సరం ₹25 లక్షలకు అమ్మాడని, దాని tax గురించి మాట్లాడడానికి వచ్చాడు.
ఆ వ్యక్తి వెళ్లిన తర్వాత… నేను వెళ్లిన పని పూర్తి చేసుకుని బయటికి వచ్చాను.
ఎంతో రోజుల తర్వాత…
తిరుపతిలోని కోటకమ్మల వీధిలో ఉన్న చంద్ర రెడ్డి అంకుల్‌ని కలవడం చాలా ఆనందంగా అనిపించింది.
68 సంవత్సరాల వయసు వచ్చినా…
తన profession ని అలసట లేకుండా, ఇష్టంగా కొనసాగించడం చూడడం చాలా inspiring గా అనిపించింది.
---
ఇంకాసేపటిలో…
దాదాపు మూడున్నర సంవత్సరాల తర్వాత… నా native village కి వెళ్లడానికి ready అవుతున్నాను.
చివరిసారి 2022 డిసెంబర్‌లో వెళ్లాను.
తిరుపతి నుంచి సుమారు 40 km దూరంలో ఉన్న నారాయణవనం మండలంలోని సముదాయం గ్రామంకి వెళ్లాలి.
2 వారాల క్రితం వెళ్లాలని అనుకుని వెళ్లలేకపోయాను… దాని గురించి ఒక బ్లాగ్ కూడా రాసాను. ఆ బ్లాగ్ చదవాలనుకుంటే…ఇక్కడ
click చేసి చదవండి 🙂
– తిరుపతి మహేష్
25/04/2026
Comments
Post a Comment