అగ్నిపరీక్ష
2013–15 సమయంలో నేను SV యూనివర్సిటీలో PG చదివేటప్పుడు మా క్లాస్‌లో 50 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్లం. అందులో ఇద్దరం అబ్బాయిలం డే స్కాలర్స్, నలుగురు అమ్మాయిలు డే స్కాలర్స్ ఉండేవాళ్లు.
నాతో పాటు ఇంకో అబ్బాయి డే స్కాలర్ ఉండేవాడు.
అతని ఇల్లు యూనివర్సిటీకి దగ్గరగా ఉండడంతో లంచ్ టైమ్‌లో ఇంటికి వెళ్లిపోయేవాడు.
కానీ నేను మాత్రం ఉదయం కాలేజీకి వచ్చేటప్పుడు లంచ్ బాక్స్ నాతోపాటు తీసుకువచ్చేవాడిని.
కాబట్టి లంచ్ టైమ్‌లో క్లాస్‌లోనే కూర్చొని మిగతా డే స్కాలర్ అమ్మాయిలతో కలిసి లంచ్ చేసేవాడిని.
ఆ నలుగురు అమ్మాయిలలో హరి ప్రియా అనే ఒక అమ్మాయి ఉండేది.
ఆమె రోల్ నెంబర్ – 37 అనుకుంటా… ఇప్పటికీ ఆ రోల్ నెంబర్ గుర్తుంది 🙂
అది ఏమిటో కానీ… హరి ప్రియా అంటే నాకు ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ ఉండేది 🙂
క్లాస్ టైమ్‌లో హరి ప్రియా అబ్బాయిలతో అసలు మాట్లాడేది కాదు.
కానీ లంచ్ టైమ్‌లో మాత్రం నాతో మాట్లాడేది…
అది నాకు చాలా హ్యాపీగా అనిపించేది 🙂
అది ఎందుకో నాకు కూడా అర్థం కాలేదు…
హరి ప్రియా వాయిస్ వినగానే నాకు సింగర్ Harini గుర్తొచ్చేది.
అంత స్వీట్‌గా ఉండేది హరి ప్రియా వాయిస్ కూడా 🙂
అలా రోజూ లంచ్ టైమ్‌లో నేను మిగతా డే స్కాలర్ అమ్మాయిలతో మాట్లాడుకుంటూ టైమ్ పాస్ చేసేవాడిని.
కానీ మా క్లాస్‌లో ఒకడివల్ల…
ఆ తరువాత రోజులు లంచ్ టైమ్ “సైలెంట్ అవర్స్” గా మారిపోయింది 😔
***
వాడి పేరు నవీన్.
ఏడుకొండలపై కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామిపై ఉన్న భక్తి వల్ల, పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో PG సీట్ వచ్చినా కూడా వదిలేసి, కోయంబత్తూరు నుంచి తిరుపతికి వచ్చి SV యూనివర్సిటీలో PGలో చేరాడు.
వాడికి తెలుగు రాదు.
క్లాస్‌లో నాకు మాత్రమే తమిళం మాట్లాడడం వచ్చేది.
అందుకే మేమిద్దరం కలిసి ఎక్కువగా తిరిగేవాళ్లం.
ఒక రోజు సాయంత్రం, కాలేజ్ అయిపోయాక ఇంటికి వెళ్తున్న సమయంలో నవీన్ హరి ప్రియకి ప్రపోజ్ చేశాడు.
అక్కడినుంచి నాకు సమస్యలు మొదలయ్యాయి 🙁
నేను నవీన్‌తో ఎక్కువగా తిరుగుతున్నానని, అతను చేసిన పనికి చివరికి నేను బలయ్యాను.
ఆ తర్వాత కొన్ని రోజులు లంచ్ టైమ్‌లో అమ్మాయిల్లో ఎవ్వరూ నాతో మాట్లాడలేదు 😔
హరి ప్రియా అయితే కాలేజీకి రావడం కూడా మానేసింది 😔
కొన్ని రోజుల తర్వాత మెల్లగా మిగతా అమ్మాయిలు మళ్లీ నాతో సహజంగా మాట్లాడడం ప్రారంభించారు.
ఆ గ్రూప్‌లో ముబీనా అనే ఒక అమ్మాయి ఉండేది.
చాలా మెచ్యూర్, టాలెంటెడ్ అమ్మాయి.
డిగ్రీ ఫైనల్ ఇయర్‌లోనే ఒక టాప్ IT కంపెనీలో జాబ్ వచ్చినా, అది జాయిన్ కాకుండా SV యూనివర్సిటీలో PG చేసింది.
2015లో PG అయిపోయాక కూడా మేము టచ్‌లో ఉండేవాళ్లం.
ఏప్రిల్ 1 ముబీనా పుట్టినరోజు.
ఆమె పుట్టినరోజు రోజునే 2019 ఏప్రిల్ 1న ముబీనాకు పెళ్లి జరిగింది 🎉
ఆ రోజు సండే.
నేను, మా క్లాస్‌లో ఉన్న ఇంకో డే స్కాలర్ అబ్బాయి కలిసి
ఆ రోజు ఉదయం తిరుపతిలో బెంగళూరు బస్సు ఎక్కి పలమనేరు లో దిగాం,
అక్కడి నుంచి ఆటోలో ముబీనా పెళ్లి జరిగే చోటుకు వెళ్లాం.
అది నా జీవితంలో నేను అటెండ్ చేసిన మొదటి ముస్లిం మ్యారేజ్ 🙂
ముబీనాను విష్ చేసి, మటన్ బిర్యానీ తిని,
మధ్యాహ్నం 2 గంటల సమయంలో మళ్లీ తిరుపతికి బయలుదేరాం.
ఆ తర్వాత ముస్లిం మ్యారేజ్‌కి వెళ్లే అవకాశం నాకు మళ్లీ వచ్చింది – గత సంవత్సరం ఏప్రిల్ 20న…
***
ఈసారి మా బ్రాంచ్‌లో పనిచేసే DEMAT సేల్స్ ఎగ్జిక్యూటివ్ షబానా పెళ్లి.
షబానా సీట్ నా కౌంటర్ పక్కనే ఉండేది.
వర్కింగ్ అవర్స్‌లో తన పని చేసుకుంటూనే, నాకు అవసరమైనప్పుడల్లా నేను పిలవగానే హెల్ప్ చేసేది.
ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రతిరోజూ నాకు సహాయం చేసిన అమ్మాయి పెళ్లికి పిలిస్తే ఎలా వెళ్లకుండా ఉంటాం?
అందుకే షబానా పెళ్లికి కచ్చితంగా వెళ్లాలని ఫిక్స్ అయ్యాను.
కానీ…
ఏప్రిల్ 20, సండే – షబానా పెళ్లి.
అదే రోజు రాత్రి నేను ఒంటరిగా తిరుపతి నుంచి తమిళనాడులోని దిండిగల్ వరకు బస్సులో ప్రయాణం చేసి,
మరుసటి రోజు దిండిగల్ బస్ స్టాండ్‌లో నా ఫ్రెండ్ శణ్ముగంని కలిసి,
మేమిద్దరం కలిసి కొడైకెనాల్‌కి వెళ్లాలని లాస్ట్ మినిట్‌లో ట్రిప్ ఫిక్స్ అయ్యింది.
ఒక పక్క నాకు షబానా పెళ్లికి వెళ్లాలనే ఉంది…
కానీ ఆమె పెళ్లి తిరుపతి నుంచి 50 కి.మీ దూరంలో పీలేరు దగ్గర ఉండడం వల్ల,
పెళ్లికి వెళ్లి వచ్చి, అక్కడ బిర్యానీ కడుపు ఫుల్‌గా తింటే
రాత్రి నేను ఒక్కడినే బస్సులో ప్రయాణం చేసే సమయంలో తెల్లవారుజామున ఏమైనా ఇబ్బంది వస్తే?
ఎక్కడ నేను ఇబ్బందిపడాల్సి వస్తుందో అనే భయం కలిగింది…
అందుకే…
చివరి నిమిషంలో ముస్లిం మ్యారేజ్ మటన్ బిర్యానీ తినాలనే కోరిక ఉన్నప్పటికీ,
రిస్క్ తీసుకోకూడదని అనిపించి, ఆ రోజు షబానా పెళ్లికి నేను వెళ్లలేదు 😔
మొన్న బుధవారం ఉదయం నేను బ్యాంక్‌కి వెళ్లగానే కంప్యూటర్‌లో లాగిన్ అవుతుండగా,
షబానా వచ్చి,
“రేపు సీమంతం ఉంది, తప్పకుండా రావాలి సర్” అని ఆహ్వానించింది.
నేను “సరే షబానా” అని చెప్పాను.
***
గత శనివారం నేను డెర్మటాలజిస్ట్ డాక్టర్ నీలిమ పార్లపల్లి గారిని కలిసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాను.
డాక్టర్ చెప్పినట్లుగా నా స్ట్రెస్‌ను పూర్తిగా తగ్గించడం నా వల్ల కాకపోయినా,
కనీసం ఆమె చెప్పిన మిగతా సూచనలను కచ్చితంగా పాటించాలని నిర్ణయించుకున్నాను.
ముఖ్యంగా తినే విషయంలో స్ట్రిక్ట్‌గా ఉండాలని ఫిక్స్ అయ్యాను.
ఏదైనా చేసి నాకు ఉన్న స్కిన్ సమస్యలో కొంతైనా మెరుగుదల కనిపించాలనే ఆశతో, డైట్ విషయంలో కట్టుదిట్టంగా ఉండాలని నిర్ణయించుకున్నాను.
కొంతమంది డాక్టర్లు నాన్‌వెజ్ తినొచ్చని అంటారు,
మరికొంతమంది తినకూడదని చెబుతారు.
కానీ నాకు మాత్రం చికెన్, మటన్ తింటే నా చర్మ సమస్య ట్రిగ్గర్ అవుతుందని నేను గమనించాను.
అందుకే… రెండు రోజుల క్రితం మంగళవారం (ఏప్రిల్ 14),
ఇంట్లో మా అమ్మ చికెన్ బిర్యానీ చేస్తానంటే, నేను మనసును కట్టడి చేసుకుని చికెన్ వద్దని చెప్పి దాని బదులుగా చేపలు చేయమని చెప్పాను😔
అలాగే నిన్న మధ్యాహ్నం షబానా సీమంతానికి వెళితే అక్కడ చికెన్ బిర్యానీ తినాల్సి వస్తుందని భావించి,
తినాలనే కోరికను అణచుకుని ఆమె సీమంతానికి కూడా వెళ్లలేదు 😔
ఈరోజు మా బ్రాంచ్ మేనేజర్ బ్రాంచ్‌లో ఉన్న అందరికీ లంచ్ ఏర్పాటు చేశారు.
నిన్న సాయంత్రమే “చికెన్, మటన్, ఫిష్ అన్నీ ఉంటాయి” అని తెలిసింది.
నిన్న షబానా సీమంతానికి వెళ్లకుండా ఉండటం వల్ల, చికెన్ బిర్యానీ తినాలనే కోరికను కంట్రోల్ చేసుకోగలిగాను.
కానీ ఈరోజు బ్రాంచ్‌లోనే లంచ్ ఉండటంతో పరిస్థితి కాస్త టెంప్టింగ్‌గా మారింది.
ఒక వైపు… తినాలనే కోరిక.
మరో వైపు… నా కోసం నేను తీసుకున్న కఠినమైన నిర్ణయం.
ఇప్పుడు నా మనసు, నా బుద్ధి మధ్య ఒక యుద్ధం జరుగుతోంది.
ఇంకా లంచ్ టైమ్‌కు సుమారు ఆరు గంటల సమయం ఉంది…
చూడాలి — చివరికి గెలిచేది ఏది?
నాన్‌వెజ్ తినాలన్న కోరికనా?
లేక నా కఠినమైన నిర్ణయమా?
చివరి నిమిషంలో నేను ఏ నిర్ణయం తీసుకుంటానో…
మటన్ బిర్యానీ తింటానా? లేక దాన్ని వదులుకుంటానా?
ఈరోజు నాకు లంచ్ టైమ్‌లో ఒక పెద్ద అగ్నిపరీక్ష ఎదురవబోతోంది 😔
---
— తిరుపతి మహేష్
17/04/2026
Control urself...
ReplyDelete