తప్పు ఎవరిదైనా… చివరికి నష్టపోయేది మాత్రం...
గత శనివారం… మూడవ శనివారం కావడంతో మాకు working day.
ఆ రోజు ఉదయం ఎప్పటిలాగే నేను నా కౌంటర్ వద్ద పని చేసుకుంటూ ఉన్నాను.
సుమారు ఉదయం 11:50 సమయంలో, ఒక్కసారిగా బ్రాంచ్లో గట్టిగా మాటలు వినిపించాయి.
మా బ్రాంచ్ అకౌంటెంట్ సివప్రసాద్, గోల్డ్ అప్రైజర్ మురళి అన్న మధ్య మాటామాటలు జరుగుతున్నాయి.
ఆ శబ్దం నా చెవిలో పడింది.
“ఏం జరుగుతోంది?” అని నేను గమనించడానికి ప్రయత్నించాను.
సాధారణంగా ఏ SBI బ్రాంచ్ అయినా గోల్డ్ లోన్స్ విషయంలో రోజుకు ఇంత మాత్రమే అనే పరిమితులు ఉండవు.
అవసరానికి అనుగుణంగా ఎన్ని లోన్స్ అయినా ఇస్తారు.
Non-home branch customers కి కూడా లోన్స్ ఇస్తారు.
ఇన్ని రోజులు ఎలాంటి ఇబ్బంది లేకుండా… పని సజావుగా సాగుతూ వచ్చింది.
కానీ ఆ రోజు ఒక్కసారిగా…
మా బ్రాంచ్లో అకౌంటెంట్ కొత్త నియమాలు పెట్టారు:
రోజుకు కేవలం 5 గోల్డ్ లోన్స్ మాత్రమే ఇవ్వాలి. Non-home branch customers కి లోన్స్ ఇవ్వకూడదు.
ఇవి ఎలాంటి పై అధికారుల ఆదేశాలు కాదు.
ఇది పూర్తిగా ఆయన తీసుకున్న వ్యక్తిగత నిర్ణయం.
దానికి గోల్డ్ అప్రైజర్ మురళి అన్న ప్రశ్నించారు:
“ఎక్కడా లేని నియమాలు ఇక్కడ ఎందుకు పెడుతున్నారు?”
అంతే కాదు…
branch కి ఎందుకు నష్టం కలిగిస్తున్నారూ? అని కూడా ప్రశ్నించారు.
అప్పటికే ఒక non-home branch customer, gold loan కోసం branch లో నిలబడి ఉన్నాడు.
accountant అతనితో, “మీ home branch కి వెళ్లి loan తీసుకోండి” అని చెప్పారు.
ఆ మాట మురళి అన్నకి నచ్చలేదు.
customer కి కూడా నచ్చలేదు.
ఎందుకంటే… అందరికీ తెలిసిన విషయం —
gold loan అనేది home branch, non-home branch అనే తేడా లేకుండా ఎక్కడైనా తీసుకోవచ్చు.
ఆ సమయంలో… ఆ customer కూడా “complaint ఇస్తాను” అన్నట్టుగా మాట్లాడాడు.
అది విని… కొంచెం ఆవేశంలో మురళి అన్న,
“అవసరం అయితే complaint ఇవ్వండి” అని చెప్పారు.
ఆ ఒక్క మాట… పరిస్థితిని పూర్తిగా మార్చేసింది.
అది accountant ego కి గట్టిగా తాకింది.
ఆ సమయంలో Chief Manager branch లో లేరు.
బ్యాంక్ పనిమీద బయటకు వెళ్లారు.
అందుకే విషయం అక్కడితో ఆగకుండా… పెద్దదైంది.
---
ఆ రోజు సాయంత్రం…
Chief Manager గారు branch కి వచ్చిన తర్వాత, accountant gold appraiser గురించి complain చేస్తూ—
“ఈ gold appraiser నాకు వద్దు.
అతను ఉంటే నేను పని చేయను.
అవసరమైతే written complaint ఇస్తాను.”
అని చెప్పారు.
ఆ ఒక్క మాటతో… ఒక చిన్న issue…
కాస్త పెద్దదైంది.
---
Gold Appraiser అనేవారు bank permanent employee కాదు. వారికి bank నుండి salary ఉండదు.
Gold loan కోసం వచ్చే customers నుంచి వచ్చే appraisal fee ద్వారానే వాళ్లు సంపాదిస్తారు.
మురళి అన్న… గత 5 సంవత్సరాలుగా ఇదే branch లో పని చేస్తున్నారు.
నాకు తెలిసి… ఇప్పటి వరకు ఆయన మీద ఒక్క చిన్న complaint కూడా రాలేదు. పనిలో చాలా perfect.
అవసరం అయితే… bank పని కాకపోయినా… staff కి gold కొనిచ్చే విషయాల్లో కూడా సహాయం చేసిన మనిషి.
అలాంటి వ్యక్తి…
ఆ రోజు accountant రోజుకు 5 gold loans ఇవ్వాలి,
non-home customers కి loan ఇవ్వకూడదు అని చెప్పడంతో…
తన income మీద ప్రభావం పడుతుందని భావించి
మురళి అన్న కాస్త గట్టిగా మాట్లాడారు.
అది సహజమే. ఎందుకంటే… అది ఆయన జీవనాధారం.
---
ఒక విషయం — accountant సివప్రసాద్ SBI Officers Association లో Tirupati zonal leader.
Chief Manager గారికి కూడా situation అర్థమైంది.
మురళి అన్న value ఆయనకు తెలుసు.
ఆయన్ని lose అవ్వాలని ఆయనకు లేదు.
కానీ…
ఇప్పటి వరకు ఇద్దరినీ పిలిచి face to face మాట్లాడలేదు.
Issue ని settle చేయడానికి ప్రయత్నించలేదు.
అది Chief Manager చేయాల్సిన ముఖ్యమైన పని.
ఆయన మురళి అన్నతో— “నీ పని నాకు తెలుసు… నిన్ను తీసేయాలనే ఉద్దేశం లేదు.
కానీ accountant adjust అవ్వడం లేదు… ఆయనతో మాట్లాడి చూడు” అని చెప్పారు.
56 ఏళ్ల మురళి అన్న… చాలా వినయంగా… accountant దగ్గరకు వెళ్లి— “సార్… ఆ రోజు నేను అలా మాట్లాడాను. క్షమించండి.
నాకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు…” అని అన్నారు.
అప్పుడు accountant — “Don’t worry… నేను personal గా తీసుకోలేదు.” అన్నారు.
కానీ… నిజం ఏమిటంటే—
ఇప్పటికీ ఆయన adjust అవ్వడానికి సిద్ధంగా లేరు.
ఒక్క మాటతో— “సరే మురళి అన్న… రేపటి నుంచి మామూలుగా పని చేసుకోండి”
అని చెప్పవచ్చు.
కానీ… ఆ మాట ఆయన నోటి నుండి రాలేదు.
ఇక్కడ మరింత బాధ కలిగించే విషయం ఏమిటంటే—
accountant attitude ముందు…
Chief Manager గారు కూడా ఎందుకో కొంచెం వెనక్కి తగ్గినట్టు అనిపించింది.
చిన్న misunderstanding వచ్చినప్పుడు…
మాట్లాడుకుని పరిష్కరించుకుంటే…
సమస్య అక్కడే ముగుస్తుంది.
కానీ ఇక్కడ…
permanent employee అయిన accountant ముందు…
gold appraiser బలహీనుడు కావడంతో
బలైపోయింది అతడే.
ఒక చిన్న వాదన…
ఇప్పుడు ఒక మనిషి జీవనాధారం మీద ప్రభావం చూపుతోంది.
కొన్ని సార్లు…
మనకు ఉన్న position కన్నా… మన మనసు పెద్దది కావాలి.
కానీ…
అంత పెద్ద మనసున్న వాళ్లు నా చుట్టూ ఎవరూ లేరేమో అనిపిస్తుంది.
— తిరుపతి మహేష్
25/04/2026
Thank you so much uncle melanti vallu vunaru kabathey enka elanti mosallu and adikaramu vunde ane headweight tho rechipotunaa employee's lanti valaki buddhi vachetatu and nijamu,tappu evaridi ane telisi kuda support cheyakundaa vunna parthi okariki buddhi ravali, repu elanti situation valaki vachenapudhu life lo evari support lekunda oka person yela face chestaru ane telusukuntaru and ma nana gari kosamu blog rasenaduku Thank you so much 🙏🏻🙂 with huge respect Daughter of kodakanti Muralidhar
ReplyDeletePeople like you are always there for each other, and will definitely help others when they need help...! Thankyou for such a great words
ReplyDelete