భయం ఎందుకు? అసలు భయపడాల్సిన అవసరమే లేదు…
నిన్న నేను రాసిన బ్లాగ్‌లో 15 సంవత్సరాల లాకింగ్ పీరియడ్ ఉన్న PPF అకౌంట్‌కు ప్రస్తుతం ఉన్న వడ్డీ రేటు 7.1% చాలా తక్కువ అని చెప్పాను. అందుకే దానికంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే ఇతర ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి ఆలోచించండి అని సూచించాను.
నిన్న మా బ్రాంచ్‌లోనే కనీసం 5 మంది కస్టమర్లు ఈ ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభంలోనే తమ PPF అకౌంట్స్‌లో ₹1.5 లక్షల పూర్తి మొత్తాన్ని డిపాజిట్ చేయడం నాకు నిజంగా ఆశ్చర్యంగా అనిపించింది.
తర్వాత ఆలోచిస్తే అర్థమైంది — ఇలా ఒకేసారి పూర్తి మొత్తాన్ని పెట్టేవారు సాధారణంగా డబ్బు విషయంలో ఇబ్బంది పడని వారు అయి ఉంటారు. వారి ఆదాయం ఎక్కువగా ఉండొచ్చు. పైగా PPFకి EEE (Exempt-Exempt-Exempt) ప్రయోజనం ఉండడం వల్ల, ఒకే సారి మొత్తం ఇన్వెస్ట్ చేసి ఉండవచ్చు.
అయితే ఇది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు.
నేను నా PPF అకౌంట్‌ను 12 డిసెంబర్ 2017న ఓపెన్ చేశాను. నా తరువాత నా తమ్ముడితో పాటు నా స్నేహితులకు కూడా PPF అకౌంట్ ఓపెన్ చేయమని చెప్పాను.
PPFకి 15 సంవత్సరాల లాకింగ్ పీరియడ్ ఉండటంతో, నా అకౌంట్ 1 ఏప్రిల్ 2033న మెచ్యూర్ అవుతుంది. అంటే ఇంకా 7 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి.
కొన్ని సంవత్సరాల పాటు నేను ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1న ₹12,000 (నెలకు ₹1000 చొప్పున) ఒకేసారి డిపాజిట్ చేసేవాడిని.
కానీ 15 సంవత్సరాల లాకింగ్ పీరియడ్, అలాగే 7.1% వడ్డీ స్థిరంగా ఉండడం వల్ల, PPF మీద ఆసక్తి తగ్గింది.
ఇప్పటి వరకు నేను నా PPF అకౌంట్ నుంచి 3 సార్లు partial withdrawal కూడా చేసాను.
ప్రస్తుతం నా PPF అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్₹85,844 నుంచి, 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిన్న చెక్ చేస్తే, ₹37,617 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చని తెలిసింది.
నిన్న withdraw చేయాలని అనుకున్నాను. కానీ బ్యాంక్‌లో పని ఎక్కువగా ఉండడంతో చేయలేకపోయాను.
---
గత సంవత్సరం 2025 ఏప్రిల్ 2న SBI షేర్ ధర ₹750 ఉండగా,
నిన్నటి తేదీ 2026 ఏప్రిల్ 2 నాటికి అది ₹1015కి పెరిగింది.
అంటే ఒక్క సంవత్సరంలో సుమారు 35% పెరిగినట్టే.
ఒకవేళ మీరు గత సంవత్సరం ఏప్రిల్ 2న ₹75,000 పెట్టి 100 SBI షేర్లు కొనుగోలు చేసి ఉంటే,
వాటి విలువ ఇప్పుడు ₹1,01,500 అయ్యేది.
ఈ మధ్యకాలంలో SBI షేర్ ధర ₹1000 దాటి ₹1100, ₹1200 వరకు వెళ్లి, ₹1234 గరిష్ట స్థాయిని చేరి, తర్వాత కొంచెం తగ్గి ప్రస్తుతం ₹1015 వద్ద ఉంది.
భారతదేశంలో అతిపెద్ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అయిన SBI మీద మీకు నమ్మకం ఉంటే,
ఒకేసారి కాకుండా — అప్పుడప్పుడూ 1 లేదా 2 షేర్లు కొనుగోలు చేస్తూ ఉండండి.
---
షేర్ మార్కెట్ అంటే భయం ఎందుకు?
చాలామందికి షేర్ మార్కెట్ అంటే ఒకరకమైన నెగటివ్ ఫీలింగ్ ఉంటుంది.
ఎందుకంటే వారు ఎక్కువగా విన్న కథలు — “లక్షల్లో నష్టపోయిన వాళ్ల కథలే”.
నష్టాలు షేర్ మార్కెట్‌లో మాత్రమే ఉండవు;
ఎవరైనా మిమ్మల్ని సంప్రదించి వారు చెప్పిన వాటిలో పెట్టుబడి పెట్టమని, “రెండురెట్లు లాభం వస్తుంది, మూడురెట్లు లాభం వస్తుంది” అని ఆశ చూపించినా, అలాంటి మాటలకు మోసపోవద్దు. ప్రస్తుతం సమాజంలో ఫేక్ మార్కెటింగ్ చాలా ఎక్కువైంది.
---
రియల్ ఎస్టేట్ పెట్టుబడుల గురించి ఒక మాట:
నేను ఎప్పుడూ “రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టండి” అని సిఫార్సు చేయను.
ఎందుకంటే నా చుట్టూ ఉన్న చాలా మంది, సమాజంలో కనిపించే fake social status మరియు social pride కోసం ఆస్తులు కొనుగోలు చేసి, చేతిలో నగదు లేక ఇబ్బందులు పడుతున్న వారిని నేను చాలామందిని చూసాను.
వారిని చూసినప్పుడు నాకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది —
అవసర సమయంలో చేతిలో డబ్బు లేకపోతే, ఎంత ఆస్తి ఉన్నా ఉపయోగం ఉండదు. “ఆస్తి కంటే లిక్విడిటీ ముఖ్యం.”
---
మన దేశంలో షేర్ మార్కెట్‌లో 5000కు పైగా కంపెనీలు ఉన్నాయి.
మీరు రోజూ ఉపయోగించే వస్తువులన్నీ ఏదో ఒక కంపెనీకి చెందినవే.
ఆ కంపెనీలు చాలా వరకు షేర్ మార్కెట్‌లో లిస్టెడ్ అయి ఉంటాయి.
*షేర్ మార్కెట్‌లో బ్యాంకింగ్ సెక్టార్ ఒక ఉదాహరణ:
SBI కాకుండా, HDFC, ICICI, Axis వంటి ప్రైవేట్ బ్యాంకులు, అలాగే Indian Bank, Canara Bank, Union Bank, Bank of Baroda వంటి ప్రభుత్వ బ్యాంకులు కూడా మార్కెట్‌లో ఉన్నాయి.
మీకు నమ్మకం ఉన్న కంపెనీల షేర్లను కొనుగోలు చేయవచ్చు.
⚠️ కానీ జాగ్రత్త:
“షేర్ మార్కెట్‌లో ఉన్న అన్ని షేర్ల ధరలు ఒకేలా పెరగవు. ఆ ప్రత్యేక కంపెనీ ఎలా పనిచేస్తోంది, ఎంత లాభం పొందుతోంది, ఎంత వృద్ధి సాధిస్తోంది అన్నదానిపై షేర్ ధర పెరగడం లేదా తగ్గడం ఆధారపడి ఉంటుంది.”
ఉదాహరణకు:
గత నెలలో HDFC బ్యాంక్ పార్ట్ టైమ్ చైర్మన్ రాజీనామా వార్త రావడంతో
ఒక్కసారిగా HDFC షేర్ ధర ₹750కి పడిపోయింది.
అయినా దాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు.
ఇలాంటి వార్తల వల్ల తాత్కాలికంగా మార్పులు వస్తాయి.
చాలా మంది ఇన్వెస్టర్లు ఒకేసారి కొనడం లేదా అమ్మడం వల్ల
మార్కెట్‌లో అటుపోటులు రావచ్చు.
కానీ పరిస్థితులు సర్దుకుంటే,
మళ్లీ షేర్ ధర పెరగడం ప్రారంభమవుతుంది.
సింపుల్ ఉదాహరణ:
మీరు ఉన్న ఏరియాలో ఒక మంచి స్థలం అమ్మకానికి వస్తే,
అందరూ కొనాలనుకుంటారు — కాబట్టి ధర పెరుగుతుంది.
అదే సమస్యలు ఉన్న చోట డిమాండ్ తక్కువగా ఉంటుంది — కాబట్టి ధర తగ్గుతుంది.
కంపెనీకి సంబంధించిన వార్తలు, డిమాండ్ & సప్లై ఆధారంగా
షేర్ మార్కెట్ కూడా ఇలాగే పనిచేస్తుంది.
షేర్ మార్కెట్ గురించి బేసిక్ లెవల్ అవగాహన ఇంతే 🙂”
చివరి మాట:
మీకు బాగా తెలిసిన, నమ్మకమైన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయండి.
లాంగ్ టర్మ్‌లో షేర్ మార్కెట్‌లో PPF కంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది.
---
తిరుపతి మహేష్
03/04/2026
Comments
Post a Comment