6 నెలల్లో ₹60,000 లాభం!...
నేను బ్యాంకులో చేరిన మొదటి కొన్ని సంవత్సరాల్లో నాకు చాలా నమ్మకంగా అనిపించిన పెట్టుబడి పద్ధతి PPF అకౌంట్.
ఆ రోజుల్లో PPF స్కీమ్ “EEE exemption” వల్ల చాలా పాపులర్‌గా ఉండేది.
ఎవరైనా నన్ను “సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఏది?” అని అడిగితే, వెంటనే PPF అకౌంట్ ఓపెన్ చేసుకోమని చెప్పేవాడిని.
కానీ ఇప్పుడు ఎవరికీ PPF అకౌంట్ ఓపెన్ చేయమని సిఫారసు చేయను.
ఇటీవల ఒక కస్టమర్ PPF అకౌంట్ ఓపెన్ చేసి, పాస్‌బుక్ కోసం నా కౌంటర్‌కి వచ్చారు.
ఆ సమయంలో నేను నాలోనే అనుకున్నాను—
“ఇప్పుడు PPF అకౌంట్ ఓపెన్ చేస్తే, 15 సంవత్సరాల తర్వాత వచ్చే రిటర్న్స్, ప్రస్తుత 7.1% వడ్డీ రేటు భవిష్యత్తులో ఇంకా తగ్గితే, ఇన్ఫ్లేషన్ కంటే తక్కువగా ఉండే అవకాశముంది. అయితే ఎందుకు PPFలో పెట్టుబడి పెట్టాలి?”
ఒకప్పుడు PPF వడ్డీ రేటు 9% పైగా ఉండేది. తర్వాత అది 8%, 7.4%గా తగ్గుతూ, ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా 7.1% వద్దే నిలిచిపోయింది.
మీ దగ్గర ఉన్న ₹1,00,000 రూపాయలు PPFలో పెట్టితే, సంవత్సరానికి ₹7,100 వడ్డీ మీ PPF అకౌంట్‌లో జమ అవుతుంది.
కానీ అదే ₹1,00,000 మీ చేతిలో ఉంటే—
DEMAT అకౌంట్ ద్వారా Gold ETFలో పెట్టినా,
లేదా షేర్ మార్కెట్‌లో Nifty 50 కంపెనీల్లో మీకు తెలిసిన నమ్మకమైన మంచి కంపెనీలో పెట్టుబడి పెట్టినా—
ఒక సంవత్సరంలో PPF కంటే మంచి రాబడులు రావచ్చు.
ఇప్పటికీ చాలా మంది సంవత్సరానికి గరిష్ట పరిమితి అయిన ₹1.5 లక్షలు PPFలో వేస్తున్నారు.
అదే డబ్బును ఇతర పెట్టుబడుల్లో పెట్టితే మంచి రిటర్న్స్ రావచ్చు అనిపిస్తుంది.
ఎక్కువ సంపాదన ఉన్న వారు డైవర్సిఫికేషన్ కోసం PPFలో పెట్టడం సరే.
వారి గురించి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.
కానీ సంపాదన తక్కువగా ఉండి, భవిష్యత్తు కోసం కొంతైనా సేవ్ చేయాలనుకునే వారు మాత్రం PPFలో పెట్టకూడదని నా అభిప్రాయం.
---
నేను 12 డిసెంబర్ 2017న PPF అకౌంట్ ఓపెన్ చేశాను.
ప్రతి సంవత్సరం ₹12,000 (నెలకు ₹1,000 చొప్పున) ఏప్రిల్ 1న ఒకేసారి డిపాజిట్ చేసేవాడిని.
కానీ తర్వాత మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్ గురించి నాకు క్లారిటీ రావడంతో,
PPFలో పెట్టడం ఆపి, కేవలం అకౌంట్ యాక్టివ్‌గా ఉండేందుకు సంవత్సరానికి ₹500 మాత్రమే వేస్తున్నాను.
---
చిన్నప్పటి నుంచి నాకు బంగారం అంటే పెద్దగా ఆసక్తి లేదు.
కానీ గత సంవత్సరం సెప్టెంబర్‌లో, బెంగళూరులో ఓపెన్ అయిన South India మొదటి Apple official స్టోర్‌కి iPhone 17 కొనడానికి release అయిన మొదటి రోజునే వెళ్లాను.
ఆ రోజు అక్కడ నాకు కావాల్సిన మోడల్ స్టాక్ మొత్తం sold out అయిపోవడంతో,
ఎప్పుడో ఒక ఫైనాన్షియల్ ఇన్ఫ్లూయెన్సర్ చెప్పిన మాట గుర్తొచ్చింది:
“Costly iPhone కొనడం కంటే Apple స్టాక్‌లో పెట్టుబడి పెట్టండి—మీ డబ్బు పెరుగుతుంది.”
కానీ Apple స్టాక్స్ కొనాలంటే అవి ఇండియన్ మార్కెట్‌లో కొనలేము;
US మార్కెట్‌లో మాత్రమే కొనగలుగుతాము.
బంగారం ధరలు పెరుగుతుండడంతో,
అప్పుడు నాకు sudden గా గోల్డ్‌లో పెట్టుబడి పెట్టాలనే ఆలోచన వచ్చింది.
గత సంవత్సరం అక్టోబర్ 1న ₹2.5 లక్షలు SBI Gold Fundలో పెట్టాను.
సంవత్సరానికి 10% రాబడి వస్తే చాలు అనుకున్నాను.
కానీ కేవలం 3 నెలల్లో 50% రాబడి వచ్చింది.
అయినా నేను ప్రాఫిట్ బుక్ చేయలేదు.
ప్రస్తుతం యుద్ధ పరిస్థితుల వల్ల ఆ లాభం 50% నుంచి 40%, 30%కు తగ్గింది.
అయినా, నిన్న ఏప్రిల్ 1 నాటికి, 6 నెలల్లో నాకు 24.98% రాబడి వచ్చింది.
అంటే:
₹2,50,000 పెట్టుబడి పెడితే
ప్రస్తుతం విలువ: ₹3,12,438
₹62,438.26 లాభం.
బంగారం ధరలు రోజూ మారుతుంటాయి.
కాబట్టి మారే రేట్ల ప్రకారం నా పెట్టుబడి విలువ కూడా మారుతూ ఉండవచ్చు.
కానీ వచ్చే అక్టోబర్ 1 నాటికి (1 సంవత్సరం పూర్తయ్యాక) ఎంత రాబడి వస్తుందో చూడాలని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను:)
---
ఇటీవల ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ నాకు కాల్ చేసి,
PPF నుండి ఎంత వరకు partial withdrawal చేయవచ్చో అడిగారు.
PPF అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత 5 ఆర్థిక సంవత్సరాలు పూర్తయితే,
ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1 తర్వాత ఒక పరిమితి వరకు డబ్బు తీసుకోవచ్చు.
ఈరోజు బ్యాంక్‌కి వెళ్లాక,
2026–27 ఆర్థిక సంవత్సరానికి నా PPF అకౌంట్ నుంచి ఎంత withdrawal వస్తుందో చూసి తీసుకోవాలి అనుకుంటున్నాను.
ప్రస్తుతం PPF ఇచ్చే 7.1% రాబడి కంటే,
బంగారంలో రాబడులు PPF కంటే 3 రెట్లు ఎక్కువగా ఉన్నాయి.
నాకు కాల్ చేసిన నా ఫ్రెండ్స్ కూడా,
గత ఆర్థిక సంవత్సరంలోనే PPF నుంచి partial withdrawal చేసి,
ఆ డబ్బును Gold ETFలో పెట్టారు.
ఈసారి కూడా PPF నుంచి డబ్బు తీసి
Gold ETFలో పెట్టాలని అనుకుంటున్నారు.
ఇప్పటికీ ఇన్ఫ్లేషన్‌ని కూడా బీట్ చేయలేని PPF అకౌంట్‌లో పెట్టుబడి పెట్టడం గురించి మీరు ఏమనుకుంటున్నారు?
---
— తిరుపతి మహేష్
02/04/2026
Comments
Post a Comment