ఆ విషయం నేను ఎలా మర్చిపోయాను...
ఈరోజు బ్యాంక్‌లో మధ్యాహ్నం భోజనం తర్వాత నా కౌంటర్‌లో కూర్చొని ఉన్నప్పుడు, customers ఎవరూ లేనప్పుడు, ఏదో ఆలోచిస్తూ ఉంటే అప్పుడొక విషయం గుర్తుకు వచ్చింది... అది గుర్తుకు రాగానే... “ఆ విషయం గతవారం ఎందుకు నాకు గుర్తు రాలేదు?” అని ఆశ్చర్యం వేసింది. సాధారణంగా నాకు కాస్త జ్ఞాపకశక్తి (Memory Power) ఎక్కువ. చాలామంది అది దేవుడు ఇచ్చిన వరం అంటారు. కానీ నేను మాత్రం... Survival కోసం సహజంగానే నా మెదడు అలా తయారైందని చెబుతాను. --- గత సోమవారం కర్ణాటకలోని కుశాల్ నగర్ సమీపంలో, కావేరి నది ఒడ్డున ఉన్న డుబారే ఏనుగుల శిబిరంలో (Dubare Elephant Camp) ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. డుబారే ఏనుగుల శరణాలయానికి విహారయాత్ర కోసం తన భర్త మరియు ఐదు సంవత్సరాల కూతురితో చెన్నైకి చెందిన 33 ఏళ్ల మహిళ వెళ్లడం జరిగింది. సాధారణంగానే ప్రతిరోజూ వందలాది టూరిస్టులు డుబారే ఏనుగుల శరణాలయానికి వెళ్లి అక్కడ ఏనుగులకు స్నానం చేయించడం, వాటికి ఆహారం పెట్టడం లాంటి activities చేస్తూ ఉంటారు. నేను కూడా ఈ సంవత్సరం జనవరిలో కూర్గ్ వెళ్లినప్పుడు, తిరుగు ప్రయాణంలో అక్కడికి వెళ్లాను. ఏనుగులకు ఎలా స్నానం చేయిస్తారో, టూరిస్టులు ఏనుగులకు ఎంత దగ్గరగ...