అనుకోకుండా ఒకరోజు హైదరాబాద్ ప్రయాణం... “2021 హైదరాబాద్ ప్రయాణ జ్ఞాపకాలు”

        2021 జనవరి చివరి వారం అనుకుంటా…

నేను, నా తమ్ముడు చెన్నై ఎగ్మోర్ – కాచిగూడ ట్రైన్‌లో రేణిగుంట స్టేషన్ నుంచి హైదరాబాద్ వెళ్లడానికి చివరి స్టాప్ కాచిగూడ స్టేషన్ వరకూ టికెట్ బుక్ చేసుకొని ఒక శుక్రవారం రాత్రి ఎనిమిది గంటలకి రేణిగుంట రైల్వే స్టేషన్‌లో ట్రైన్ ఎక్కాము.

12 గంటల ప్రయాణం తర్వాత మరుసటి రోజు, శనివారం ఉదయం ఎనిమిదికి కాచిగూడ స్టేషన్‌లో దిగాము.

కాచిగూడ ప్రాంతంలోనే ముందుగానే OYO రూమ్ ఒక రోజుకి బుక్ చేసుకొని ఉన్నాము.

కానీ చెక్-ఇన్ సమయం మధ్యాహ్నం 12కి ఉన్నా early check-in option ఉందా అని ముందే కనుక్కొని రూమ్ బుక్ చేసుకొని ఉండడంతో

కాచిగూడ స్టేషన్ నుంచి 5 నిమిషాల్లో హోటల్ చేరుకోగానే రూమ్‌కి వెళ్లిపోయాము.

---

చిన్నప్పుడు ఎప్పుడో నేను మూడో క్లాస్ లేదంటే నాలుగో క్లాస్‌లో ఉండగా వేసవికాల సెలవుల్లో అప్పట్లో హైదరాబాద్‌లో చూడాల్సినవన్నీ చూసిన గుర్తు.

ఆ తర్వాత హైదరాబాద్ వెళ్లినా ఏదో ఒక పని కోసం వెళ్లడం, పని ముగించుకొని వెంటనే తిరుపతి వచ్చేయడం జరుగుతుండేది.

ఈసారి హైదరాబాద్ వచ్చిందీ ఎప్పుడో చిన్నప్పుడు చూసినవన్నీ గుర్తులేకపోవడంతో మళ్లీ కుదిరినవాటిని రెండు రోజుల్లో చూడాలనిపించి

వచ్చాము.

---

ఉదయం పది గంటలకల్లా స్నానం చేసి ready అయిపోయి మొదటగా మేము వెళ్లింది బిర్లా మందిర్‌కి.

1976లో, దాదాపు 50 సంవత్సరాల క్రితం పూర్తిగా పాలరాతితో నిర్మించబడిన బిర్లా మందిర్‌ను

బిర్లా కుటుంబం వారు కట్టించారు.

హైదరాబాద్ మాత్రమే కాకుండా భారతదేశంలో 10కి పైగా పట్టణాల్లో బిర్లా కుటుంబీకులు ఇలాంటి పాలరాతి ఆలయాలను నిర్మించడం జరిగింది.

బిర్లా మందిర్‌లో ఉన్న అన్ని దేవుళ్లను చూసాక ఆ తర్వాత మేము 5 నిమిషాల్లో చేరుకునే దూరంలో ఉన్న బిర్లా ప్లానెటోరియంకి వెళ్లాము.

ఆ తర్వాత అక్కడనుంచి మేము వెళ్లింది సాలార్ జంగ్ మ్యూజియం.

బిర్లా మందిర్, బిర్లా ప్లానెటోరియం, సాలార్ జంగ్ మ్యూజియం… ఈ మూడు మధ్యాహ్నం ఒకటిలోపు

మేము చూసేయడం జరిగింది.

ఆ తర్వాత RTC Cross Roads లో ఉండే famous Bawarchi Biryani కి వెళ్లి చికెన్ బిర్యానీ తిన్నాము.

ఆ తర్వాత తిరిగి రూమ్‌కి వచ్చి కొంతసేపు పడుకొని విశ్రాంతి తీసుకొని సాయంకాలం 4 గంటలకి ట్యాంక్ బండ్ దగ్గరకు వెళ్లాము. హుస్సేన్ సాగర్‌లో బుద్ధుడిని చూడడానికి 2 నిమిషాల పడవ ప్రయాణం చేశాము.

కాసేపు ట్యాంక్ బండ్ రోడ్ చుట్టూ తిరిగి అక్కడనుంచి మేము తర్వాత chat items taste చేయడానికి famous Gokul Chat కి వెళ్లాము.

అక్కడ ఎంత rush అంటే… అసలు మేము ఊహించలేదు.

ఎలాగో రెండు మూడు chat items taste చేసి అక్కడనుంచి… రాత్రి చార్మినార్ దగ్గర ఉండే Hotel Shadab కి వెళ్లి

అక్కడ మటన్ బిర్యానీ తిని రాత్రి సమయంలో చార్మినార్ చూసి చార్మినార్ చుట్టూ ఉండే వీధుల్లో కాసేపు తిరిగి

రూమ్‌కి వచ్చేశాము.

---

ఆదివారం ఉదయం త్వరగా లేచి రూమ్ checkout చేసి Ram Ki Bandi famous dosa కి వెళ్లి 2-3 రకాల దోసెలు taste చేసి చిలుకూరు బాలాజీ గుడికి వెళ్లాము.

చాలా చిన్న గుడి… కానీ ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే US visa వచ్చేస్తుంది అనే నమ్మకం ప్రజల్లో బాగా చేరడంతో చిలుకూరు బాలాజీ

“US visa దేవుడు” అయిపోయాడు.

నమ్మకం లేకపోయినా నేనుకూడా B1/B2 US tourist visa నాకు రావాలి… అలా వస్తే తిరిగి వస్తానని అనుకుంటూ చిలుకూరు బాలాజీకి ఒక  application పెట్టుకొని ఫలక్‌నుమా ప్యాలెస్  ( Falaknuma Palace) చూద్దాం అని వెళ్లితే…

Taj Hotel Groups ఫలక్‌నుమా ప్యాలెస్ తీసుకున్నారని తెలిసింది.

ఫలక్‌నుమా ప్యాలెస్ చూడడానికి Tourists కి అనుమతి లేదు.

Taj Hotel లో book చేసుకొని ఉంటేనే లోపలికి పంపుతారు అని ఫలక్‌నుమా ప్యాలెస్ gate వరకూ వెళ్లాక తెలిసింది 😞

అప్పటికే సమయం మధ్యాహ్నం 12 అవ్వడంతో ఆ తర్వాత గంట సేపు bus ప్రయాణం చేసి సికింద్రాబాద్‌లో ఉన్న Paradise Biryani (Main Branch) కి వెళ్లి నిజాం చికెన్ బిర్యానీ తిన్నాము.

రెండు రోజుల్లో హైదరాబాద్‌లో తిన్న మూడు బిర్యానీలలో నాకు Paradise Biryani taste satisfaction ఇచ్చింది.

---

ఆ రోజు సాయంకాలం 5 గంటలకి సికింద్రాబాద్ నుంచి తిరుపతికి తిరుగు ప్రయాణంలో రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ బుక్ చేసుకొని ఉన్నాము.

తమ్ముడి friend తేజ సాయి తెలంగాణ హైకోర్టులో ఒక senior lawyer కింద work చేస్తుండడంతో అతని room కి వెళ్లి కాసేపు time spend చేసి Hyderabad famous ice cream Swiggy లో order చేసి తిని సికింద్రాబాద్ వచ్చి ట్రైన్ ఎక్కి మరుసటి రోజు ఉదయం తిరుపతి చేరుకున్నాము.

---

2021 జనవరి చివరి వారం రెండు రోజుల trip… తక్కువ సమయంలోనే

చాలా ఎక్కువ ప్రదేశాలకు వెళ్లిన satisfaction.

ఆ తర్వాత 2022 జూన్ చివరి వారంలో నాకు inter-circle transfer రావడంతో జూన్ 24 శుక్రవారం తిరుత్తణి SBI branch నుంచి relieve అయ్యాను.

ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన SBI Local Head Office హైదరాబాద్‌లో ఉండడంతో మొదట అక్కడ report చేయాలి కాబట్టి

అప్పుడు ఒకసారి హైదరాబాద్ వెళ్లాను. ఆ తర్వాత....

---

మూడు రోజుల క్రితం గురువారం రాత్రి ఎనిమిది గంటలకి అలా నా బాబాయి కొడుకు వాసు ఒక పనికై హైదరాబాద్‌కి వెళ్తున్నాను… నీకు శనివారం సెలవు ఉంటే అలా రా హైదరాబాద్ వెళ్దాం… అని చెప్పాడు.

పని అవ్వగానే మళ్లీ వచ్చేయడమే అని చెప్పడంతో నేనుకూడా ఇంట్లోనే ఉండి ఎక్కడికీ పోకుండా bore  కొడుతుండడంతో ఒక్క సెకండ్ ఆలోచించి వాసుతో పాటు హైదరాబాద్ వెళ్లడానికి సిద్ధం అయిపోయాను.

చివరి క్షణంలో హైదరాబాద్‌కి శుక్రవారం సాయంకాలం రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ దొరకడంతో

ఆరోజు bank నుంచి నేరుగా సాయంకాలం స్టేషన్ వెళ్లి ట్రైన్ ఎక్కేశాను.

నిన్న ఉదయం 6 గంటలకి సికింద్రాబాద్ స్టేషన్‌లో దిగి వాసు పని ముగించుకొని

మధ్యాహ్నం సికింద్రాబాద్‌లో ఉండే Paradise Biryani main branch లో

తినాలనిపించి ఈసారి నిజాం మటన్ బిర్యానీ తిని మధ్యాహ్నం 2:25కి

సికింద్రాబాద్ – తిరువనంతపురం వెళ్లే సబరి ఎక్స్‌ప్రెస్ తిరుపతి మీదుగా వెళ్తుంటుంది కాబట్టి

general ticket తీసుకొని last minute లో ట్రైన్ ఎక్కేశాము.

గుంటూరు వరకూ అగ్నికుండంలో ప్రయాణం చేసి రాత్రి 7 గంటలకి ఇంకా ఆపైన తిరుపతి వరకూ సబరి ఎక్స్‌ప్రెస్‌లో మేము ప్రయాణం చేయలేమనిపించి గుంటూరులో దిగి అక్కడ నుంచి bus లో ఈరోజు ఉదయం తిరుపతి చేరుకున్నాము.

---

2022 June తర్వాత దాదాపు 4 సంవత్సరాల తర్వాత

అనుకోకుండా just ఎనిమిది గంటలు మాత్రమే హైదరాబాద్‌లో ఉండి హైదరాబాద్ వెళ్లి రావడం

చాలా కొత్తగా అనిపించింది నాకు.

నేను వెళ్లి వచ్చిన ఒక్కరోజు హైదరాబాద్ ప్రయాణ విశేషాల blog ని detail గా మీరు చదవాలంటే కింద ఉన్న comment box లో comment చేయండి.

ఎక్కువ comments వస్తే నిన్న వెళ్లి వచ్చిన ఒక్కరోజు హైదరాబాద్ ప్రయాణ అనుభవాలను మీతో పంచుకుంటాను.

— తిరుపతి మహేష్

24/05/2026 

Comments

Popular posts from this blog

మీతో పంచుకోవాలనుకున్న ఒక సంతోషకరమైన విషయం…... Welcome to My...

తప్పు ఎవరిదైనా… చివరికి నష్టపోయేది మాత్రం...

ఒక తండ్రి మనసు…

Happy Birthday to My Dear…... ❤️

రెండు సంవత్సరాల క్రితం… సరిగ్గా ఈ రోజు: మేము ఇల్లు మారిన కథ

అగ్నిపరీక్ష

వెనక్కి వెళ్లిన అడుగులు… మళ్లీ మేల్కొన్న జ్ఞాపకాలు...

దీక్ష భగ్నం అయింది… My Lord!

ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబం… ఇంకా ఉన్నాయా?

ఒక అమ్మాయి అడిగిన ప్రశ్న