Happy Birthday to My Dear…... ❤️

నేను చెన్నైలో స్కూల్ చదివేటప్పుడు, ప్రతి ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు మాకు స్టడీ అవర్స్ ఉండేవి.

ఆ స్టడీ అవర్స్‌లో బయట నుంచి చాలామంది వాలంటీర్లు వచ్చి, మాకు పుస్తకాలు చదివి వినిపించడం లాంటివి చేసేవారు.

అలా ప్రతి వీకెండ్ చెన్నైలోని చాలా కంపెనీల నుంచి ఉద్యోగులు వాలంటీర్లుగా వచ్చి మాకు సహాయం చేసేవారు.

కంపెనీలు మాత్రమే కాదు…

కొంతమంది స్వచ్ఛందంగా — “సండే రోజు ఇంట్లో ఉండి ఏమి చేస్తాం?” అని స్కూల్‌కి వచ్చి మాతో టైమ్ గడిపేవారు.

అలా నాకు పరిచయమైన వ్యక్తి — రిచర్డ్ రోసారియో.

రిచర్డ్ సర్ అప్పట్లో చెన్నైలో ఒక గేమ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లో పని చేసేవారు.

ఆయనకు కంప్యూటర్ అసెంబుల్ చేయడం గురించి మంచి అవగాహన ఉందని తెలిసిన తర్వాత…

ప్రతి ఆదివారం ఆయన స్కూల్‌కి వచ్చినప్పుడు, కంప్యూటర్ అసెంబ్లింగ్, హార్డ్‌వేర్ గురించి నాకు ఉన్న సందేహాలు అడిగి తెలుసుకునేవాడిని.

ఆయన వల్లనే నాకు కంప్యూటర్ అసెంబ్లింగ్ మీద ఆసక్తి వచ్చింది.

---

2009 మార్చిలో ప్లస్ టూ బోర్డ్ ఎగ్జామ్స్ రాసి, పర్మనెంట్‌గా తిరుపతికి వచ్చాను.

మొదటిగా నేను MS Office క్లాస్ జాయిన్ అయ్యాను.

అప్పటి వరకు నాకు కంప్యూటర్ ఎలా వాడాలో ఏమాత్రం అవగాహన లేదు.

కంప్యూటర్ నేర్చుకోవాలన్న నా ఆసక్తికి JIT ఇన్‌స్టిట్యూట్ ఓనర్ స్వర్ణ మేడం చాలా సపోర్ట్ చేశారు.

నన్ను మోర్నింగ్ & ఈవెనింగ్ బ్యాచ్ రెండింటికీ అటెండ్ అవ్వమని చెప్పారు.

ఇంట్లో కంప్యూటర్ లేకపోవడంతో, ఇన్‌స్టిట్యూట్ lab లోనే ఒక కంప్యూటర్‌లో నాకు అవసరమైన JAWS స్క్రీన్ రీడర్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసి ప్రాక్టీస్ చేసేవాడిని.

ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేసే మిగతా స్టాఫ్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు.

మే చివరికి కోర్స్ పూర్తయ్యింది.

తర్వాత…

ఎలాగైనా అసెంబుల్డ్ కంప్యూటర్ కొనాలని నేను ఫిక్స్ అయ్యాను.

చెన్నైలో రిచర్డ్ సర్ ఇచ్చిన కంప్యూటర్ కోటేషన్ ఆధారంగా ఇంట్లో చెప్పి నాకు కంప్యూటర్ కొనిచ్చాలని అడిగాను.

మాకు తెలిసిన ఒక అంకుల్ ద్వారా తిరుపతిలో శ్రీదేవి కాంప్లెక్స్‌లో ఉన్న ఒక షాప్‌కి వెళ్లి, నాకు కావాల్సిన కాన్ఫిగరేషన్‌లో అసెంబుల్డ్ కంప్యూటర్ కావాలని చెప్పాను.

అలా…

2009 జూన్ 7న, నేను కోరుకున్న కాన్ఫిగరేషన్‌లో కొత్త కంప్యూటర్ ఇంటికి వచ్చింది.

ఆ తర్వాత…

కంప్యూటర్ నా జీవితంలో ఒక భాగమైపోయింది.

---

2010 జనవరిలో నేను చదివిన స్కూల్ వారు నాకు ఒక laptop ఇచ్చారు.

ఇంట్లో కొనిచ్చిన డెస్క్‌టాప్,

స్కూల్ ఇచ్చిన Lenovo laptop — నాకు, నా తమ్ముడికి దాదాపు 15 సంవత్సరాలు ఉపయోగపడ్డాయి.

నా తమ్ముడు అయితే ఇంజనీరింగ్ చదివేటప్పుడు, నాకు స్కూల్‌లో ఇచ్చిన Lenovo Pentium laptop తోనే మొత్తం ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.

తర్వాత 2019 అక్టోబర్‌లో, తన పర్సనల్ ఉపయోగం కోసం ఒక కొత్త Lenovo laptop కొనుకున్నాడు.

---

ఇంట్లో డెస్క్‌టాప్ కంప్యూటర్ విషయానికి వస్తే…

నేను, నా తమ్ముడు చాలా ప్రయోగాలు చేశాం.

ఏదైనా సమస్య వస్తే ఆ భాగం మాత్రమే మార్చుకుంటూ 2022 ఆగస్టు వరకు వాడాం.

తర్వాత అది పూర్తిగా పని చేయడం ఆపేసింది.

ఆ తర్వాత 2010లో స్కూల్ వారు నాకు ఇచ్చిన ల్యాప్‌టాప్‌ను నేను 2024 ఏప్రిల్ వరకు వాడాను.

2024 ప్రారంభంలో laptop స్లో అవ్వడం మొదలైంది.

అప్పుడు YouTube లో తెలుగు టెక్ యూట్యూబర్స్ Lenovo IdeaPad Slim 5 (Intel Ultra i5) AI laptop వీడియోలు చూసి, ఆ laptop కొనాలని అనిపించింది.

ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో ధరలు చూసి, రీసెర్చ్ చేసి…

చివరికి May 3, 2024 (శుక్రవారం) — సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం ఈరోజే — తిరుపతిలో Leela Mahal దగ్గర ఉన్న Reliance Digital లో నేను కోరుకున్న laptop కొనుగోలు చేశాను.

laptop Specs:

Intel Ultra Core i5 125H processor

16GB LPDDR5 RAM

1TB NVMe Gen4 SSD

14-inch OLED Display

Windows 11 + MS Office 2021

₹80,000 ధర ఉండగా, డిస్కౌంట్లతో ₹77,000కి తీసుకున్నాను.

ఆ సమయంలో అది నా జీవితంలో నేను కొనుగోలు చేసిన అత్యంత ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువు.

కొనేటప్పుడు భయం కూడా వేసింది — “ఏమైనా నేను తెలియక డ్యామేజ్ చేస్తానా?” అని.

అందుకే అక్కడే అదనంగా ₹3,000 ఖర్చుపెట్టి 3 సంవత్సరాల వారంటీ కూడా తీసుకున్నాను.

మొదట్లో నేను కొత్త పెళ్లికూతురిలా జాగ్రత్తగా చూసుకున్న laptop…

కాలక్రమంలో ఆ భయం తగ్గిపోయింది.

ఎక్కడికైనా వెళ్తే నాతో పాటు దాన్ని కూడా వెంట తీసుకెళ్లేవాడిని.

ఈ రెండు సంవత్సరాల్లో ఈ laptop నాకు ఇచ్చిన ఉపయోగం ఎంతో చెప్పలేను.

2009లో ₹40,000 ఖర్చుపెట్టి కొనిచ్చిన డెస్క్‌టాప్ కంప్యూటర్ 2009 నుంచి 2022 వరకు — దాదాపు 13 సంవత్సరాలు

నాకు ఇచ్చిన ప్రయోజనం విలువ కట్టలేనిది.

ఆ కంప్యూటర్ ద్వారా నేర్చుకున్నది, పొందిన జ్ఞానం — అమూల్యం.

---

చెన్నైలో రిచర్డ్ సర్‌తో మొదలైన నా కంప్యూటర్ ప్రయాణం,

తిరుపతిలో JIT ఇన్‌స్టిట్యూట్ స్వర్ణ మేడం సపోర్ట్,

మరియు శ్రీదేవి కాంప్లెక్స్‌లో మేము కంప్యూటర్ కొనుగోలు చేసిన షాప్ ఓనర్ వేణు అంకుల్ సహాయం —

ఎప్పటికీ మర్చిపోలేనివి.

ఈరోజుతో…

Lenovo IdeaPad Slim 5 laptop కొనుగోలు చేసి 2 సంవత్సరాలు పూర్తయ్యాయి.

ఇప్పుడు మూడో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది.

Happy Birthday to my dear laptop ❤️

2009 జూన్‌లో డెస్క్‌టాప్‌తో ప్రారంభమైన నా కంప్యూటర్ ప్రయాణం,

ఇప్పుడు ఒక 14-inch laptop సహాయంతో నా అవసరాలన్నీ తీర్చుకుంటున్నాను.

భవిష్యత్తులో laptop కంటే చిన్నగా ఉండే Microsoft Windows టాబ్లెట్ — Surface Book కొనాలని కోరిక ఉంది.

చూడాలి… ఈ Lenovo IdeaPad Slim 5 AI laptop ‌ను ఇంకా ఎన్నేళ్లు వాడుతానో మరి.

– తిరుపతి మహేష్

03/05/2026 

Comments

Popular posts from this blog

మీతో పంచుకోవాలనుకున్న ఒక సంతోషకరమైన విషయం…... Welcome to My...

తప్పు ఎవరిదైనా… చివరికి నష్టపోయేది మాత్రం...

ఒక తండ్రి మనసు…

రెండు సంవత్సరాల క్రితం… సరిగ్గా ఈ రోజు: మేము ఇల్లు మారిన కథ

అగ్నిపరీక్ష

వెనక్కి వెళ్లిన అడుగులు… మళ్లీ మేల్కొన్న జ్ఞాపకాలు...

దీక్ష భగ్నం అయింది… My Lord!

ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబం… ఇంకా ఉన్నాయా?

ఒక అమ్మాయి అడిగిన ప్రశ్న