ఈ కాలంలో ఎంతమంది తల్లులు అలా చెబుతారు?
నాకు ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు నన్ను చెన్నైలో ఒక స్పెషల్ స్కూల్లో మొదటి తరగతిలో చేర్పించారు.
ఆ సమయానికి నాకు ఒక్క ముక్క కూడా తమిళం మాట్లాడటం రాదు.
కానీ నాకు తెలియకుండానే తమిళం నేర్చుకుని, తమిళ మీడియంలోనే చదివి, Plus Two public exams లో చదివిన స్కూల్లో నేనే school first వచ్చాను.
1200 మార్కులకు 1000 పైగా స్కోర్ చేశాను.
సంవత్సరంలో దాదాపు పది నెలలు ఇంటి నుంచి దూరంగా హాస్టల్లోనే పెరిగాను కాబట్టి,
నా చదువు గురించి ఇంట్లో వాళ్లు పెద్దగా ఏమీ మాట్లాడినట్టు గుర్తు లేదు.
కానీ ఒక్కసారి మాత్రం… అది ఎనిమిదో లేక తొమ్మిదో తరగతి అయి ఉండొచ్చు.
ఒక సోమవారం తెల్లవారుజామున, సెలవులు అయిపోయాక మళ్లీ స్కూల్‌కి వెళ్లడానికి తిరుపతి bus stand లో చెన్నై వెళ్లే bus నన్ను ఎక్కించడానికి వెళ్తున్నప్పుడు…
మొదటిసారి నా జీవితంలో నన్ను ఇంకొకరితో పోలుస్తూ… “వాళ్లను చూడు… చదివి ఉద్యోగం తెచ్చుకుని settle అయ్యారు. నువ్వూ బాగా చదవాలి… మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి…” అని నా పెద్దనాన్న పిల్లలతో compare చేసి నాకు చెప్పడం జరిగింది.
అంతే.
ఆ తర్వాత చదువైనా… ఉద్యోగమైనా… నా జీవితానికి సంబంధించిన చాలా నిర్ణయాలు నేనే తీసుకుంటూ వస్తున్నాను.
కానీ ఈ కాలం parents విషయానికి వస్తే…
LKG నుంచే “బాగా చదువు… class first రావాలి…” అని చెప్పి చెప్పి పిల్లలపై అనవసరమైన ఒత్తిడి పెడుతున్న parents ను చాలా మందిని చూస్తున్నాను.
ప్రతి parent తమ పిల్లలు class first రావాలని అనుకుంటే, అంతమంది ఎలా class first వస్తారు? :)
మునుపటి తరం parenting ఒకలా ఉంటే…
ఇప్పుడు competitive world కి అనుకూలంగా చిన్నప్పటి నుంచే తమ పిల్లలను పెంచడానికి అన్నీ చేస్తున్నామని చెప్పుకుంటూ, parents ఆలోచనా విధానం చాలా wrong direction లో వెళ్తోంది అనిపిస్తుంది.
అందరి పిల్లల IQ ఒకేలా ఉండదు. ఒక్కొక్కరికి తమ తమ area of interest వేరువేరుగా ఉండొచ్చు.
కానీ majority తల్లిదండ్రులు మాత్రం “నా కొడుకు, కూతురు IIT లో seat కొట్టాలి” లేక “NEET లో government medical college లో MBBS seat తెచ్చుకోవాలి” అనే ఆలోచనతో చిన్నప్పటి నుంచే coaching ఇప్పించడం జరుగుతోంది.
పిల్లలకు నిజంగా IIT లో B.Tech చేయాలనే interest ఉందో లేదో కూడా తెలియదు.
కానీ తల్లిదండ్రులు మాత్రం తమ social pride కోసం…
“బాగా చదివితే IIT seat వస్తుంది… life settle అవుతుంది…” అని చెప్పి చెప్పి, Maths, Physics, Chemistry తప్ప జీవితంలో ఇంకేం పిల్లలకు తెలియకుండా చేసేస్తున్నారు.
అంతేకాదు…
పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు కూడా కోట్ల ఆశలతో తమ పిల్లలు బాగా చదివి, మంచి ఉద్యోగం తెచ్చుకుని తమను పేదరికం నుంచి పైకి తీసుకెళ్తారని ఆశిస్తూ పిల్లలను పెంచుతున్నారు.
ఒకవేళ పిల్లలు వాళ్లు అనుకున్నట్టు ఉద్యోగం తెచ్చుకోకపోతే…
“వాళ్లను చూడు… వీడిని చూడు…” అని compare చేసి పిల్లలను మానసికంగా ఇబ్బంది పెట్టే తల్లిదండ్రులను ఈ కాలంలో చాలా మందిని చూస్తున్నాను.
పిల్లలకు మంచి అలవాట్లు నేర్పి, జీవితానికి ఒక purpose ఉండాలి… సమాజానికి ఒక మంచి పౌరుడిగా తీర్చిదిద్దాలని చెప్పి పెంచుతున్న parents ను మాత్రం నేను చూడలేదు.
చాలా మంది parents కి తమ పిల్లలు future లో ఒక ATM machine లా వారికి ఉండాలని కోరుకునే తల్లిదండ్రులను కూడా ఎక్కువ శాతంలో చూస్తున్నాను.
బతకడానికి డబ్బు అవసరమే.
కానీ సమస్య… ఇంకొకరిని మెప్పించడానికి డబ్బు సంపాదించాలి అనుకున్నప్పుడే మొదలవుతుంది.
ఇది parents ఎప్పుడు అర్థం చేసుకుంటారో…
---
YouTuber Harsha Sai గురించి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు.
నాకు అయితే నాలుగేళ్ల క్రితమే అతని YouTube channel పరిచయం అయింది.
మొదటిసారి Harsha Sai గురించి తెలిసినప్పుడు, ఇంతలా నేను Harsha Sai content ను ఇష్టపడతానని అసలు expect చేయలేదు.
కానీ తర్వాత ఆయన videos చూసి, నేను Harsha Sai big fan అయ్యిపోయాను.
సంవత్సరం క్రితం Harsha Sai మీద చాలా allegations వచ్చాయి.
హర్ష సాయి మీద పూర్తి నమ్మకం ఉండడం వల్ల, వాటి నుంచి ఎలాగైనా బయటపడాలని కోరుకున్నాను.
ఆ తర్వాత channel లో ఎలాంటి వీడియో కూడా upload కాలేదు.
గత ఆదివారం రాత్రి నిద్రపోయేముందు YouTube లో latest updates చూస్తుంటే, Harsha Sai video ఉదయం upload అయినట్టు తెలిసింది.
ఆ 33 నిమిషాల video పూర్తిగా చూశాను.
ఒక్కసారి కాదు… మరుసటి రోజు కూడా కలిపి మొత్తం మూడు సార్లు చూశాను.
Harsha Sai ఆ వీడియోతో comeback అవడం చూసి, సోమవారం జరిగిన తమిళనాడు election counting results కూడా నేను పట్టించుకోలేదు.
మనసంతా Harsha Sai comeback అయిన ఆనందంతో నిండిపోయింది.
ఇంకా 30 ఏళ్లు కూడా నిండలేదు Harsha Sai కి.
విశాఖపట్నంలోని GITAM University లో B.Tech చేసి, 2018 నుంచి YouTube లో content creator గా ఉన్నాడు.
Harsha Sai కి ఎనిమిదేళ్ల వయసులోనే ఆయన అమ్మ చనిపోయింది.
కానీ చనిపోవడానికి ముందు ఆయన అమ్మ చాలా సార్లు…
“Life కి ఒక purpose ఉండాలి…” అని Harsha Sai తో చెప్పిందట.
ఆ మాటలు Harsha Sai లో చాలా లోతుగా నాటుకుపోయాయి.
తన profession ద్వారా, తన అమ్మ అనుకున్నట్టుగా తన life కి ఒక purpose చేసుకోవడం కాకుండా,
లక్షలాది మందికి inspiring గా ఉండటం చాలా మంచి విషయం.
అలా Harsha Sai చిన్నప్పుడే ఆయన అమ్మ చెప్పినట్టుగా…
ఈ కాలంలో ఎంతమంది తల్లులు తమ పిల్లలకు అలా చెబుతారు?
ఈ blog గురించి మీరు ఏమనుకుంటున్నారో…
కుదిరితే కింద comment box లో ఏదైనా చెప్పి వెళ్లండి.
— తిరుపతి మహేష్
08/05/2026
😊
ReplyDelete