ఆ విషయం నేను ఎలా మర్చిపోయాను...
ఈరోజు బ్యాంక్‌లో మధ్యాహ్నం భోజనం తర్వాత నా కౌంటర్‌లో కూర్చొని ఉన్నప్పుడు, customers ఎవరూ లేనప్పుడు,
ఏదో ఆలోచిస్తూ ఉంటే అప్పుడొక విషయం గుర్తుకు వచ్చింది...
అది గుర్తుకు రాగానే...
“ఆ విషయం గతవారం ఎందుకు నాకు గుర్తు రాలేదు?” అని ఆశ్చర్యం వేసింది.
సాధారణంగా నాకు కాస్త జ్ఞాపకశక్తి (Memory Power) ఎక్కువ.
చాలామంది అది దేవుడు ఇచ్చిన వరం అంటారు.
కానీ నేను మాత్రం...
Survival కోసం సహజంగానే నా మెదడు అలా తయారైందని చెబుతాను.
---
గత సోమవారం కర్ణాటకలోని కుశాల్ నగర్ సమీపంలో, కావేరి నది ఒడ్డున ఉన్న డుబారే ఏనుగుల శిబిరంలో (Dubare Elephant Camp) ఒక విషాద ఘటన చోటుచేసుకుంది.
డుబారే ఏనుగుల శరణాలయానికి విహారయాత్ర కోసం తన భర్త మరియు ఐదు సంవత్సరాల కూతురితో చెన్నైకి చెందిన 33 ఏళ్ల మహిళ వెళ్లడం జరిగింది.
సాధారణంగానే ప్రతిరోజూ వందలాది టూరిస్టులు డుబారే ఏనుగుల శరణాలయానికి వెళ్లి అక్కడ ఏనుగులకు స్నానం చేయించడం,
వాటికి ఆహారం పెట్టడం లాంటి activities చేస్తూ ఉంటారు.
నేను కూడా ఈ సంవత్సరం జనవరిలో కూర్గ్ వెళ్లినప్పుడు, తిరుగు ప్రయాణంలో అక్కడికి వెళ్లాను.
ఏనుగులకు ఎలా స్నానం చేయిస్తారో, టూరిస్టులు ఏనుగులకు ఎంత దగ్గరగా ఉంటారో నాకు తెలుసు.
అలా గత సోమవారం ఉదయం రెండు ఏనుగులకు నది ఒడ్డున చుట్టూ జనాలు ఎప్పటిలాగే స్నానం చేయిస్తుండగా,
“కంజన్” అనే ఏనుగు, “మార్థాండ” అనే మరో ఏనుగుపై ఉన్నట్టుండి దాడి చేయడం జరిగింది.
కంజన్ తన దంతాలతో మార్తాండపై దాడి చేయడంతో, ఆ ధాటికి తట్టుకోలేక మార్తాండ కింద పడిపోయింది.
ఈ క్రమంలో ఏనుగుల చుట్టూ ఉన్నవాళ్లు అంతా పరుగులు తీశారు.
ఏనుగుల గొడవలో, 4000 కిలోల బరువున్న మార్తాండ ఏనుగు సెకన్ల వ్యవధిలో
చెన్నైకి చెందిన ఆ మహిళపై పడటంతో, ఆమె ప్రాణాలు కోల్పోయారు.
ఆ వార్త తెలిసిన వెంటనే నాకు చాలా బాధ వేసింది.
నిజానికి మేము డుబారే ఏనుగుల శరణాలయానికి వెళ్లినప్పుడు,
ఏనుగులను నదికి స్నానానికి తీసుకువెళ్లినప్పటి నుంచి, నదిలో వాటికి స్నానం చేయించేంతసేపు
excitement తో ఏనుగుల పక్కనే ఉన్నా, లోపల మాత్రం కాస్త భయం ఉండేది.
ఈ సంఘటన జరిగిన రెండు రోజులకే, కర్ణాటక ప్రభుత్వం “Hundred Feet Rule” తీసుకొచ్చింది.
ఇకపై టూరిస్టులు ఏనుగులకు స్నానం చేయించడం కానీ, ఆహారం పెట్టడం కానీ చేయకూడదు.
వంద అడుగుల దూరం నుంచే వాటిని చూడాలని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.
నాకు ఎప్పుడూ ఏనుగులను దగ్గర నుంచి చూస్తే భయం వేస్తుంది.
అంత పెద్ద, భారీ ఆకారం ఉన్న ఒక జంతువు...
ఆలోచించే శక్తి లేని జీవి...
ఎప్పటికైనా మనుషులకు danger అనిపిస్తూనే ఉంటుంది.
---
2022 ఆగస్టులో రెండు వారాల నేపాల్ ట్రిప్‌కు నేను నా తమ్ముడు వెళ్లినప్పుడు, Chitwan National Park లో రెండు గంటల పాటు
ఏనుగు మీద safari చేశాము.
ఆ విషయం ఈరోజు మధ్యాహ్నం బ్యాంక్‌లో వేరే ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే గుర్తుకు వచ్చింది.
నేపాల్‌లోని Chitwan National Park లో చేసిన Elephant Safari ని నేను ఎలా మర్చిపోయానా అని గుర్తొచ్చినప్పుడు,
“నాకేమైనా మతిమరపు మొదలైందా?” అనే అనుమానం కూడా నాకు మొదలైంది. :)
— తిరుపతి మహేష్
25/05/2026
Comments
Post a Comment