3 రోజుల వరుస సెలవులు... ముగిశాయి
మూడు రోజుల వరుస సెలవులు రాకముందు, దాదాపు వారం రోజుల నుంచే ఈ మూడు రోజుల సెలవులను ఉపయోగించుకుని ఎక్కడికైనా వెళ్లాలని అనుకున్నాను. కానీ దురదృష్టవశాత్తూ ఎక్కడికీ వెళ్లలేకపోయాను. గురువారం సాయంత్రం బ్యాంక్ నుంచి నేరుగా నేను ఎప్పుడూ వెళ్లే కేటీ రోడ్‌లోని ఒక సెలూన్‌కు వెళ్లాను. తలనొప్పిగా ఉండటంతో సాగర్ అన్న చేతుల మీదుగా మంచి హెడ్ మసాజ్ చేయించుకుని, రాత్రి 7 గంటల సమయంలో ఇంటికి వచ్చాను. ఆ రోజు భోజనం చేసి పడుకున్నాను. శుక్రవారం ఉదయం 10 గంటలకు నిద్రలేచాను. ఎక్కడికీ వెళ్లకపోవడంతో ఈ మూడు రోజుల సెలవులను వృథా చేస్తున్నానేమో అనిపిస్తూ కొంచెం బాధగా అనిపించింది. అప్పుడే నా బాబాయి కొడుకు వాసు ఫోన్ చేసి, ప్రస్తుతం తాను చదువుతున్న The Old Man and His God పుస్తకంలోని శ్రీమతి సుధా మూర్తి గారు రాసిన రెండు కథలను నాకు చెప్పాడు. వాసు చెప్పిన ఆ రెండు కథలను చదవడానికి గూగుల్‌లో వెతికాను. కానీ ఎక్కడా దొరకలేదు. తర్వాత యూట్యూబ్‌లో ఒక మహిళ ఆ రెండు కథలను చదివి అప్‌లోడ్ చేసిన వీడియోలు కనిపించాయి. Two Faces of Poverty మరియు Mother's Love అనే ఆ రెండు కథలను యూట్యూబ్‌లో ఒక్కో లైన్ శ్రద్ధగా వింటూ వెళ్లాను. ఆ రెండు కథలు నా ...