ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను...

నిన్న సాయంత్రం నేను రాసిననాయొక్క Income Tax Filing అయిపోయింది... మీది?

Blog Publish చేసిన తర్వాత ఒక విషయం గుర్తొచ్చింది.

ఆ విషయం గురించి కచ్చితంగా రాయాలని అనుకున్నాను.

ఎలాగో ప్రస్తుతం Income Tax Filing Season కాబట్టి, దానికి సంబంధించిన కొన్ని Blogs వరుసగా రాయాలని అనుకుంటున్నాను.

కాబట్టి గుర్తొచ్చిన ఆ విషయం గురించి కూడా కుదిరినప్పుడు రాద్దాం అనుకున్నాను.

అది దేని గురించి అంటే...

---

మీ దగ్గర 80 లక్షలు ఉన్నాయని అనుకుందాం.

ఆ డబ్బును మీరు ఏదో ఒక Bank లో Fixed Deposit చేసి, ప్రతి నెల Interest మీ Savings Account లో పడేలా ఏర్పాటు చేశారని అనుకుందాం.

Bank కి Income Tax Department ఏమి చెబుతుందంటే...

ఎవరైతే Customer Fixed Deposit చేశారో, వారికి Bank ఇచ్చే Interest సంవత్సరం మొత్తానికి కలిపి,

60 సంవత్సరాల లోపు ఉన్నవారికి సంవత్సరానికి 50,000 కంటే ఎక్కువ Interest వస్తే, ఆ Interest పై 10% TDS పట్టుకుని, మిగతా డబ్బును ప్రతి నెల Savings Account లో వేయాలని చెబుతుంది.

అదే 60 సంవత్సరాలు పైబడిన Senior Citizens కి సంవత్సరానికి లక్ష కంటే ఎక్కువ Interest వస్తే, ఆ Interest పై 10% TDS పట్టుకుని, మిగతా డబ్బును వారి Account లో వేయాలని చెబుతుంది.

Customer Interest Amount నుంచి Deduct చేసిన TDS ను Bank Income Tax Department కి Deposit చేస్తుంది.

ఎవరి TDS Amount ను Bank Deduct చేసి Income Tax Department కి ఇచ్చిందో, ఆ Customer June–July నెలల్లో Income Tax Return File చేసుకుని, Overall Income Tax Exemption Limit దాటకుండా ఉంటే, ఆ TDS మొత్తాన్ని Refund గా తిరిగి పొందవచ్చు.

ఉదాహరణకి...

ఒక వ్యక్తి Private లేదా Government ఉద్యోగం చేస్తూ సంవత్సరానికి 12,75,000 కంటే ఎక్కువ ఆదాయం పొందుతున్నారని అనుకుందాం.

ఆ వ్యక్తి Bank లో Fixed Deposit వేస్తే, వచ్చే Interest పై Tax చెల్లించాల్సి వస్తుంది.

అదే ఆ వ్యక్తి Salary మరియు ఇతర Income Sources కలిపి 12,75,000 దాటకపోతే, ఎక్కడైనా TDS Deduct అయినా, Income Tax Return File చేసి Cut అయిన మొత్తాన్ని Refund గా తిరిగి తీసుకోవచ్చు.

ఒకవేళ మీకు Bank FD Interest తప్ప ఇంకే Income లేకపోతే, Fixed Deposit వేస్తున్నప్పుడు పై చెప్పిన Interest Limits దాటినా Tax Deduct కాకుండా ఉండాలని Self Declaration Form 121 ఇవ్వవచ్చు.

మునుపు ఈ Form ని 15G / 15H అని పిలిచేవారు.

---

విషయానికి వస్తే...

ఎలా 80 లక్షలు Bank లో Fixed Deposit చేసి, ప్రతి నెల వచ్చే Interest ను Income గా చూపిస్తారో, ఆ Interest ద్వారా వచ్చే ప్రతి రూపాయి కూడా Legal Income గానే పరిగణించబడుతుంది.

అదే 80 లక్షలు పెట్టి ఒక ఇల్లు కొనుగోలు చేసి, దానిని Rent కి ఇచ్చి ప్రతి నెల బాడుగ పొందితే, ఆ Rental Income కూడా Income గానే పరిగణించబడుతుంది.

కానీ వాస్తవానికి చాలామంది House Rental Income ను Income Tax Return లో చూపించరు. నెలకు 5,000 వచ్చినా, 50,000 వచ్చినా, లక్ష వచ్చినా అది మీకు వచ్చిన ఆదాయమే.

అలాగే Income Tax Return లో చూపించని Rental Income ను Income Tax Department, Undisclosed Income గా కూడా పరిగణించే అవకాశం ఉంది.

"నేను ఇంటి బాడుగను Cash రూపంలో చేతిలో తీసుకుంటాను. లేదా Bank Account లో వేయించుకుంటాను. కానీ Income Tax Return లో మాత్రం చూపించను" అని ఉద్దేశపూర్వకంగా Rental Income ను దాచిపెడితే, అది Tax Evasion (పన్ను ఎగవేత)గా పరిగణించబడే అవకాశం ఉంది.

కాబట్టి House Rental Income మీకు ఉంటే, దాన్ని ITR లో Declare చేయడం మంచిది.

ITR Filing చేసేముందు ఒకసారి Salary Income, Savings Account Interest, FD Interest, Capital Gains ఎలా చూసుకుంటారో...

అలాగే House Rental Income కూడా మీకు వస్తే, దానిని కూడా కలిపి Return File చేయండి.

ఒకసారి Artificial Intelligence ను Income Tax Department పూర్తిస్థాయిలో అమలు చేస్తే, మీ Account లోకి Salary తప్ప ఇంకే రూపంలో డబ్బు వచ్చినా, దానికి సంబంధించిన లెక్కలు చూపించాల్సిన పరిస్థితి రావచ్చు.

అప్పుడు ఇబ్బంది పడటంకంటే, ఇప్పటి నుంచే Transparent గా మీ Income ను చూపించి Income Tax Return File చేయండి.

ఎందుకంటే Income Tax File చేయడం కేవలం చట్టపరమైన బాధ్యత మాత్రమే కాదు...

మన దేశ అభివృద్ధిలో మన వంతు బాధ్యతను నిజాయితీగా నిర్వర్తిస్తున్నామని చెప్పే ఒక మంచి పౌరుడి గుర్తింపు కూడా.

— తిరుపతి మహేష్

22/06/2026

Comments

Popular posts from this blog

మీతో పంచుకోవాలనుకున్న ఒక సంతోషకరమైన విషయం…... Welcome to My...

తప్పు ఎవరిదైనా… చివరికి నష్టపోయేది మాత్రం...

ఒక తండ్రి మనసు…

Happy Birthday to My Dear…... ❤️

రెండు సంవత్సరాల క్రితం… సరిగ్గా ఈ రోజు: మేము ఇల్లు మారిన కథ

అగ్నిపరీక్ష

వెనక్కి వెళ్లిన అడుగులు… మళ్లీ మేల్కొన్న జ్ఞాపకాలు...

దీక్ష భగ్నం అయింది… My Lord!

ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబం… ఇంకా ఉన్నాయా?

ఒక అమ్మాయి అడిగిన ప్రశ్న