నాయొక్క Income Tax Filing అయిపోయింది... మీది?

నిన్న Income Tax ITR Filing గురించి ఒక బ్లాగ్ రాశాను.

ఎవరైనా ఆ బ్లాగ్ చదవకపోతే, ఒకసారిఇక్కడ

Click చేసి ఆ బ్లాగ్ చదివిన తర్వాత ఈ బ్లాగ్‌ను చదవడం కొనసాగించండి.

మన దేశంలో ఉద్యోగులు Private అయినా, Government అయినా, వారి ఆదాయాన్ని బట్టి ముందుగానే Employer Income Tax ను Deduct చేస్తారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం June–July నెలల్లో Income Tax Return (ITR) e-Filing చేసుకోవాలి.

ఉద్యోగులు చెల్లించే Income Tax ను Direct Tax అంటారు.

మన దేశ జనాభా దాదాపు 146 కోట్లు ఉంటే, అందులో కేవలం 6 శాతం మంది మాత్రమే, అంటే సుమారు 8 కోట్ల మంది మాత్రమే Income Tax Return File చేస్తున్నారు.

వీరు మాత్రమే కాదు, చిన్న చిన్న వ్యాపారులు మొదలుకుని Reliance, Tata, Adani వంటి పెద్ద Corporate సంస్థలు కూడా Income Tax Return File చేయాలి.

మీరు ఏదైనా సంస్థలో ఉద్యోగం చేస్తున్నట్లయితే, మీ జీతం, Bonus, Incentive లేదా మీకు వచ్చిన ప్రతి రూపాయి ఆదాయాన్ని లెక్కకట్టి, దానికి సంబంధించిన TDS ను ప్రతి నెల జీతం నుంచే Deduct చేసి, మీ Employer Income Tax Department కు చెల్లిస్తారు.

అంతేకాకుండా మీకు వచ్చిన ఇతర ఆదాయాలను కూడా Income Tax Return File చేసేటప్పుడు చూపించాలి. ఉదాహరణకు:

• Savings Bank Interest

• Fixed Deposit Interest

• Shares పై వచ్చిన Dividend Income

• Stocks, Mutual Funds లేదా ఇతర ఆస్తులను అమ్మడం వల్ల వచ్చిన Capital Gains

ఇలాంటి ఆదాయాలను కూడా కలిపి Income Tax Return File చేయాలి.

ఇంకా నాకు Bank నుంచి Form 16 ఇవ్వలేదు. కానీ Income Tax Portal లో దాదాపు మొత్తం Data Update కావడంతో, 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నా Income Tax Return ను ఈరోజే నేనే File చేసేశాను.

మీకు Income Tax e-Filing కి సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే నన్ను సంప్రదించవచ్చు.

— తిరుపతి మహేష్

21/06/2026 

Comments

Popular posts from this blog

మీతో పంచుకోవాలనుకున్న ఒక సంతోషకరమైన విషయం…... Welcome to My...

తప్పు ఎవరిదైనా… చివరికి నష్టపోయేది మాత్రం...

ఒక తండ్రి మనసు…

Happy Birthday to My Dear…... ❤️

రెండు సంవత్సరాల క్రితం… సరిగ్గా ఈ రోజు: మేము ఇల్లు మారిన కథ

అగ్నిపరీక్ష

వెనక్కి వెళ్లిన అడుగులు… మళ్లీ మేల్కొన్న జ్ఞాపకాలు...

దీక్ష భగ్నం అయింది… My Lord!

ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబం… ఇంకా ఉన్నాయా?

ఒక అమ్మాయి అడిగిన ప్రశ్న