4 సంవత్సరాలు...

సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం, ఈరోజు...

2022 జూన్ 24, శుక్రవారం — తిరుత్తణి SBI బ్రాంచ్‌లో నా చివరి దినం.

దానికి ముందు రోజు, 2022 జూన్ 23 గురువారం ఉదయం, నేను కౌంటర్‌లో పని చేస్తుండగా ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న వార్త తెలిసింది. నాకు Inter-Circle Transfer మంజూరైందని తెలిసింది.

ఆ వార్త విన్న క్షణం నా ఆనందానికి అవధులు లేకపోయాయి. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కోరిక నెరవేరింది. వెంటనే నా తల్లిదండ్రులకు, స్నేహితులకు ఫోన్ చేసి ఆ శుభవార్తను పంచుకున్నాను.

ఆ రోజు గురించి నేను"పరమానందం... జూన్ 23, 2022 "

 అనే Title ‌తో నిన్న ఒక బ్లాగ్ కూడా రాశాను. ఎవరైనా ఆ బ్లాగ్ చదవకపోతే, ఒకసారి చదవండి.

2022 జూన్ 24 శుక్రవారం సాయంత్రం, నేను అధికారికంగా తిరుత్తణి బ్రాంచ్ నుంచి రిలీవ్ అయ్యాను. బ్రాంచ్ మేనేజర్ నా కోసం చిన్న వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తిరుత్తణిలో నాకు తెలిసిన చాలామంది ఆ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఆ వీడ్కోలు కార్యక్రమం నా జీవితంలో అత్యంత భావోద్వేగభరితమైన, ఎప్పటికీ మర్చిపోలేని క్షణాల్లో ఒకటి.

ఆ రోజు రాత్రి తిరుత్తణి బ్రాంచ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఇక నా జీవితం సుఖమయం అవుతుందని అనుకున్నాను.

కానీ...

గత నాలుగు సంవత్సరాలుగా తిరుపతిలో నాకు జీవితం సులభం కాలేదు...

ప్రతి క్షణం కొత్త సవాళ్లతోనే గడిచింది.

---

ఏడేళ్ల వయసు నుంచే నేను చెన్నైలో హాస్టల్‌లో పెరిగాను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచే తల్లిదండ్రులతో గడిపిన సమయం చాలా తక్కువ.

అందువల్ల వారితో నాకు బలమైన భావోద్వేగ బంధం ఏర్పడలేదు. వాళ్లు కూడా వారికి నచ్చిన పనుల్లో, వారి జీవితాల్లో బిజీగా ఉండిపోయారు.

పుట్టుకతోనే నాకు దృష్టి వైకల్యం (Visual Impairment) ఉన్నప్పటికీ, నేను ఎదుర్కొనే ఇబ్బందుల గురించి వారు పెద్దగా పట్టించుకున్నట్లు నాకు ఎప్పుడూ అనిపించలేదు. వారికి తోచిన విధంగానే వారు జీవించారు.

అదృష్టమో, దురదృష్టమో తెలియదు. కానీ నేను మాత్రం నా జీవితాన్ని నేనే మోస్తూ ముందుకు సాగుతున్నాను.

ఇప్పటికీ నా బాధలను, నా మనసులోని మానసిక పోరాటాలను నా తల్లిదండ్రులతో పంచుకోను.

ఎందుకంటే వారు నిజమైన శ్రద్ధతో వింటారని, లేదా నాకు కావాల్సిన భావోద్వేగ మద్దతు ఇస్తారని నాకు అనిపించదు.

నాకు ఉన్న ఆరోగ్య సమస్యల గురించి కూడా వారికి పెద్దగా ఆందోళన ఉన్నట్టు అనిపించదు.

తిరుపతికి బదిలీ అయిన తర్వాత, ఈ నాలుగు సంవత్సరాల్లో నా జీవితంలో అత్యంత కఠినమైన, డిప్రెషన్‌తో నిండిన దశను కూడా నేను అనుభవించాను.

ఆ సమయంలో కూడా నా తల్లిదండ్రులు తమ ఆలోచనల ప్రకారం, వారికి ఏమి కావాలో అది చేసుకుంటూ వెళ్లారే తప్ప, నా గురించి ప్రత్యేకంగా ఆలోచించిన సందర్భాలు ఉన్నట్లు నాకు ఎప్పుడూ అనిపించలేదు.

 నిజం చెప్పాలంటే...

"నా తమ్ముడు నాతో ఉన్నంతవరకు నా పరిస్థితి కొంతవరకు బాగానే ఉండేది. తల్లిదండ్రుల మద్దతుకంటే ఒక మెట్టు ఎక్కువగానే, చిన్నప్పటి నుంచే అతను నాకు తోడుగా, అండగా నిలిచాడు."

కానీ గత సంవత్సరం జూన్ నెలలో అతనికి పెళ్లై, బెంగళూరుకు వెళ్లిపోయిన తర్వాత...

తిరుపతిలో నాకు ఏ చిన్న అవసరం వచ్చినా బయటవారి సహాయం కోరాల్సిన పరిస్థితి ఏర్పడింది. కారణం, నా ఆత్మగౌరవాన్ని చంపుకుని నా తల్లిదండ్రులను అడగడానికి నా మనసు ఒప్పుకోలేదు. Because of them, I suffered deep emotional scars. I went through a lot of trauma and emotional distress, which severely affected and damaged my mental health.

కష్టం అయినా, నష్టం అయినా...

ఎలాగో ఈ నాలుగు సంవత్సరాలు తిరుపతిలో గడిపేశాను.

ఇంకా ఎంతకాలం ఇలా సాగుతుందో నాకు తెలియదు.

ప్రస్తుతం నేను అనుభవిస్తున్న మానసిక బాధలకు, పోరాటాలకు ప్రధాన కారణం ఎవరు అని ఎవరైనా అడిగితే...

ఎటువంటి సందేహం లేకుండా నేను చెబుతాను...

నా తల్లిదండ్రులే.

వారికి నచ్చిన విధంగా జీవించడం, వారి ప్రాధాన్యతలకే ఎక్కువ విలువ ఇవ్వడం, నా పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోలేకపోవడం — ఇవన్నీ నా జీవితంలో చాలా బాధలకు కారణమయ్యాయని నేను భావిస్తున్నాను.

ఈ విషయం తెలిసిన నా బంధువులు కూడా ఇంటికి వచ్చినప్పుడు నా పరిస్థితి గురించి, నా భవిష్యత్తు గురించి, నా తల్లిదండ్రులతో మాట్లాడిన సందర్భాలు దాదాపుగా లేవు.

వారు తమ అవసరాల గురించి మాట్లాడుకుని, తమ పనులు చూసుకుని వెళ్లిపోతారే తప్ప, నా గురించి కనీసం ఒక మాట అడిగిన సందర్భాలు కూడా చాలా తక్కువ.

ఈ నాలుగు సంవత్సరాల్లోనే నా తల్లిదండ్రుల నిజ స్వరూపాన్ని నేను మరింత దగ్గరగా చూశాను.

అంతకుముందు నా జీవితం ఒక యంత్రంలా గడిచేది.

ప్రతిరోజూ ఉదయం లేవడం...

రెడీ అయి తిరుత్తణికి వెళ్లడం...

సాయంత్రం తిరిగి ఇంటికి రావడం...

ఆ అలసటలో తిని పడుకోవడం...

మళ్లీ మరుసటి రోజు అదే జీవితం...

అలా సంవత్సరాలు గడిచిపోయాయి.

కానీ తిరుపతికి బదిలీ అయిన తర్వాతే నా చుట్టూ ఉన్న మనుషుల నిజ స్వరూపం, వారి ఆలోచనా విధానం, వారి ప్రాధాన్యతలు ఏమిటో నాకు అర్థమవడం ప్రారంభమైంది.

---

తిరుపతి మహేష్

24/06/2026

Comments

Popular posts from this blog

మీతో పంచుకోవాలనుకున్న ఒక సంతోషకరమైన విషయం…... Welcome to My...

తప్పు ఎవరిదైనా… చివరికి నష్టపోయేది మాత్రం...

ఒక తండ్రి మనసు…

Happy Birthday to My Dear…... ❤️

రెండు సంవత్సరాల క్రితం… సరిగ్గా ఈ రోజు: మేము ఇల్లు మారిన కథ

అగ్నిపరీక్ష

వెనక్కి వెళ్లిన అడుగులు… మళ్లీ మేల్కొన్న జ్ఞాపకాలు...

దీక్ష భగ్నం అయింది… My Lord!

ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబం… ఇంకా ఉన్నాయా?

ఒక అమ్మాయి అడిగిన ప్రశ్న