ఆరు చుక్కలు… కోట్లాది జీవితాలు…...
1997 జూన్ నెల చివరి వారంలో వచ్చిన ఒక శుక్రవారం… నా తల్లిదండ్రులు నన్ను చెన్నైలో ఉన్న, దృష్టి లోపం ఉన్న పిల్లల కోసం నడపబడే ఒక ప్రత్యేక పాఠశాలలో మొదటి తరగతిలో చేర్పించారు. ఆ స్కూల్ blind students కోసం నడపబడేదిగా ఉండడంతో, మొదటి తరగతి నుంచే నా విద్యా ప్రయాణం బ్రెయిల్ పద్ధతిలోనే ప్రారంభమైంది. సాయంత్రం సమయాల్లో volunteers ఎవరో ఒకరు వచ్చి సాధారణ పుస్తకాలు చదివేవారు… వాళ్లు చదివింది జాగ్రత్తగా విని, నేను బ్రెయిల్‌లో నోట్స్ రాసుకోవడం… తర్వాత పరీక్షల సమయంలో, నేనే రాసుకున్న ఆ బ్రెయిల్ నోట్స్‌ను తిరిగి చదవడం… అలా చెన్నైలో నా పాఠశాల జీవితం మొత్తం 12 సంవత్సరాలు గడిచింది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే — ఎంత సమయం, ఎంత శ్రమతో కూడుకున్న ఆ బ్రెయిల్ విధానంలో పన్నెండు సంవత్సరాలు నేను ఎలా చదివానో అనిపిస్తే… నాకే నమ్మశక్యం కాకుండా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ రోజుల్లో… మేము చదువుకోవడానికి ఒక శక్తివంతమైన సాధనం బ్రెయిల్ అన్న నిజాన్ని మేమెప్పటికీ మర్చిపోలేము. 2009లో నేను తిరుపతిలోని SV Arts కాలేజీలో చేరిన తర్వాత, బ్రెయిల్ నుంచి కంప్యూటర్‌పై ఆధారపడి చదివే విధానానికి మారాను. ప్రతి రోజు ఇంటి నుంచి బ్యాంక్, బ్యాంక్ నుం...