నూతన సంవత్సరం: ఉత్సాహం తగ్గి… అవగాహన పెరిగిన రోజు...

జనవరి ఒకటి — నూతన సంవత్సరం రోజు అంటే చిన్నప్పటి నుంచే నాకు ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ ఉండేది.

డిసెంబర్ 31 రాత్రి నిద్రపోకుండా, సరిగ్గా 12 గంటలకు ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసి “హ్యాపీ న్యూ ఇయర్” చెప్పిన రోజులు…

ఎప్పుడో ముగిసిపోయాయి.

గత కొన్ని సంవత్సరాలుగా మాత్రం, ఒక చిన్న పాజిటివ్ ఆలోచనతో, కొంచెం ఆశతో,

ఇంట్లో అమ్మ చేసే చికెన్ బిర్యానీతో, చాలా సింపుల్‌గా నూతన సంవత్సరం రోజును జరుపుకుంటూ వస్తున్నాను.

నిన్న సాయంత్రం బ్యాంక్ నుంచి ఇంటికి చేరేసరికి, రాత్రి ఏడున్నర దాటిపోయింది.

అప్పటికే మా అపార్ట్‌మెంట్‌లో నూతన సంవత్సరం సంబరాలు ప్రారంభమయ్యాయి.

వాటిని నేను పట్టించుకోకుండా, ఎప్పటిలాగే భోజనం చేసి, టైమ్‌కి నిద్రపోయాను.

సడన్‌గా అమ్మ నన్ను నిద్రలేపి, చేతిలో కేక్ ఇచ్చి తినమన్నప్పుడు, సమయం ఎంత అని అడిగితే — 12:20 అని చెప్పింది.

‘మనం కొత్త సంవత్సరంలోకి వచ్చేశాం’ అనే భావన నాలో కలిగింది.

కిటికీ అవతల బయట దూరంగా ఎక్కడో పిల్లలు ‘హ్యాపీ న్యూ ఇయర్’ అని ఒకరికొకరు చెప్పుకుంటున్న శబ్దం వినిపించింది.

మొబైల్ తీసి చూసే సరికి 4–5 వాట్సాప్ నోటిఫికేషన్లు కనిపించాయి.

అవి అన్నీ ఫార్వర్డ్ న్యూ ఇయర్ విషెస్ మెసేజ్‌లే అయి ఉంటాయని అనుకుని,

‘ఉదయం చూస్తా…’ అనుకుని మళ్లీ పడుకున్నాను.

ఈరోజు ఉదయం నిద్రలేచిన వెంటనే, ఈ ఏడాది నేను దృష్టి పెట్టాల్సిన విషయాల గురించి కాసేపు ఆలోచించి,

‘New Year Resolution’ అని చెప్పుకోకుండా,

నాకు కావాల్సిన కొన్ని లక్ష్యాలను మనసులోనే నిర్ణయించుకున్నాను.

ఆ తర్వాత స్నానం చేసి, రెడీ అయ్యి, టిఫిన్ చేసి,

కొద్దిసేపట్లో Rapido బుక్ చేసుకుని బ్యాంక్‌కి వెళ్లడానికి రెడీ అవుతున్నాను.

కొత్త సంవత్సరం మొదటి రోజే బ్యాంక్‌కి వెళ్లడం మాత్రం నాకు అసలు ఇష్టం లేదు.

కానీ నేను పనిచేస్తున్న SBI బ్రాంచ్‌లో RFI ఆడిట్ జరుగుతుండటంతో, లీవ్ తీసుకునే పరిస్థితి లేదు.

అందుకే ఈరోజు బ్యాంక్‌కి వెళ్లాల్సిందే.” 😔

---

భారత కాలమానం ప్రకారం నిన్న సాయంత్రం 3:30కి, కిరిబాటి దేశంలోని Kiritimati అనే చిన్న దీవిలో మొదటగా నూతన సంవత్సరం వచ్చింది.

దాని తర్వాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, జపాన్, కొరియా, ఫిలిప్పీన్స్, హాంకాంగ్, సింగపూర్, చైనా, థాయ్‌లాండ్…

ఇలా చాలా దేశాలు మనకంటే ముందే నూతన సంవత్సరాన్ని ఆహ్వానించాయి.

మన తర్వాత కూడా, తమ తమ టైమ్ జోన్ ప్రకారం, ఇంకా చాలా దేశాలు కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తున్నాయి.

ఇంకా కొద్దిసేపట్లో, భారత కాలమానం ప్రకారం ఉదయం 10:30కి,

అమెరికా తూర్పు తీరంలోని నగరాలు — New York, Washington D.C., Boston, Miami, Atlanta లో నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది.

ఆ తర్వాత, భారత కాలమానం ప్రకారం ఉదయం 11:30కి — Chicago, Austin, Houston, San Antonio

మధ్యాహ్నం 12:30కి — Denver, Phoenix

మధ్యాహ్నం 1:30కి — Los Angeles, San Francisco, San Diego, Seattle, Silicon Valley

చివరగా, ఈరోజు భారత కాలమానం ప్రకారం సాయంత్రం 3:30కి,

పసిఫిక్ మహాసముద్ర మధ్యలో ఉన్న హవాయి రాష్ట్రంలో నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది.

“7 ఖండాలు,

195 దేశాలు,

సుమారు 800 కోట్ల మంది ప్రజలు—

మొత్తం ప్రపంచం ఒకే రోజును కలిసి జరుపుకునే రోజు ఉంటే,

అది ఈ నూతన సంవత్సరం మొదటి రోజే.”

నా స్నేహితులకు,

సహోద్యోగులకు,

అందరికీ—

2026 సంవత్సరం ఒక మంచి, పాజిటివ్‌గా నిండిన సంవత్సరంగా ఉండాలని,

శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఆరోగ్యంగా ఉండాలని

మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

---

తిరుపతి మహేష్

01/01/2026

Comments

Popular posts from this blog

మీతో పంచుకోవాలనుకున్న ఒక సంతోషకరమైన విషయం…... Welcome to My...

తప్పు ఎవరిదైనా… చివరికి నష్టపోయేది మాత్రం...

ఒక తండ్రి మనసు…

Happy Birthday to My Dear…... ❤️

రెండు సంవత్సరాల క్రితం… సరిగ్గా ఈ రోజు: మేము ఇల్లు మారిన కథ

అగ్నిపరీక్ష

వెనక్కి వెళ్లిన అడుగులు… మళ్లీ మేల్కొన్న జ్ఞాపకాలు...

దీక్ష భగ్నం అయింది… My Lord!

ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబం… ఇంకా ఉన్నాయా?

ఒక అమ్మాయి అడిగిన ప్రశ్న