మనసుతో పనిచేసిన మనిషి
ఈరోజు నేను పని చేస్తున్న మునిసిపల్ రోడ్ బ్రాంచ్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్న సుధాకర్ రెడ్డి గారు సూపర్ అన్న్యువేషన్ ద్వారా రిటైర్ అవుతున్నారు. 2011 జూన్ 1 నుంచి ఎస్బీఐలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తూ, తాటిపత్రి మెయిన్ బ్రాంచ్, శ్రీకాళహస్తి మెయిన్ బ్రాంచ్, ప్రస్తుతం నేను పనిచేస్తున్న మునిసిపల్ రోడ్ బ్రాంచ్‌లలో సేవలందించారు. మొత్తం చూస్తే, దాదాపు 15 సంవత్సరాలకు 2 నెలలు తక్కువగా ఎస్బీఐలో పని చేసి ఈరోజు సూపర్ అన్న్యువేషన్ ద్వారా రిటైర్ అవుతున్నారు. నేను 2022 జూలై 2న మునిసిపల్ రోడ్ బ్రాంచ్‌లో రిపోర్ట్ చేసినప్పటికీ, అప్పటికే సర్ అక్కడ పనిచేస్తున్నారు. మొదట్లో నేను కూర్చున్న కౌంటర్ వరుస కౌంటర్ల మధ్యలో ఉండటం వల్ల, సర్‌తో ఎక్కువగా మాట్లాడుకునే అవకాశం రాలేదు. కానీ 2023 జూన్‌లో వెంకట లక్ష్మి గారు (డిప్యూటీ బ్రాంచ్ మేనేజర్) వచ్చిన తర్వాత నా కౌంటర్‌ను బ్రాంచ్ ఎంట్రన్స్ దగ్గరికి మార్చారు. అప్పటి నుంచి మేము క్రమంగా మాట్లాడుకోవడం ప్రారంభమైంది. 2024 జూన్ నుంచి నేను రాపిడో ద్వారా ఇంటి నుంచి బ్యాంక్‌కి, బ్యాంక్ నుంచి ఇంటికి ప్రయాణం ప్రారంభించిన తర్వాత, ప్రతి రోజు ఉదయం నేను బ్యాంక్‌కు వచ్చినప్పటి...