అనుకోని ప్రయాణం… అద్భుతమైన అనుభవం!

రెండు రోజుల సడెన్, అనుకోని బెంగళూరు ట్రిప్ ముగించుకుని నిన్న రాత్రి సుమారు 9 గంటలకు ఇంటికి వచ్చాను.

ఇంటికి వచ్చాక బ్యాగ్‌లో ఉన్న వస్తువులు బయటకు తీస్తూ ఉండగా ఒక్కసారిగా ఒక విషయం గుర్తొచ్చింది.

ఆ విషయం గుర్తొచ్చిన వెంటనే నాకు ఆశ్చర్యంగా అనిపించింది.

---

గత బుధవారం నాకు తలనొప్పి రావడంతో బ్యాంక్‌కు లీవ్ పెట్టాను.

ఈరోజు (మార్చి 21, శనివారం) వర్కింగ్ డే కావడంతో ఎక్కడికైనా ట్రిప్ వెళ్దాం అని ముందే లీవ్ పెట్టాలని ఫిక్స్ అయ్యాను.

కానీ ఏ ప్లాన్ కూడా వర్కౌట్ కాలేదు.

బుధవారం సడెన్‌గా లీవ్ పెట్టాల్సి రావడంతో, ఆ తర్వాత వచ్చిన నాలుగు రోజులు ఎలా ఉపయోగించుకోవాలో ఏం చేయాలో అర్థం కాలేదు.

ఇంకో వైపు, బెంగళూరులో ఉన్న నా తమ్ముడు, అతని భార్య వీకెండ్‌కు తిరుపతికి కారులో వస్తారని తెలుసు.

అప్పుడు ఒక ఆలోచన వచ్చింది:

“బుధవారం రాత్రి ట్రైన్‌లో బెంగళూరు వెళ్లి, వాళ్లతో 2 రోజులు ఉండి తిరిగి వాళ్లతో రావచ్చు కదా!”

మరో ఆలోచన కూడా వచ్చింది —

బెంగళూరులో ఉన్న నా బాబాయ్ కొడుకు వాసు దగ్గరకు వెళ్లి, అతనితో ఎక్కడికైనా ట్రిప్ వెళ్దామా అని.

బుధవారం సాయంత్రం 6:30 సమయంలో

రాత్రి 9:30కి తిరుపతి–చామరాజనగర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో టికెట్ ఉందా అని చూసాను —

టికెట్ లేదు.

బస్‌లో బెంగళూరుకు వెళ్లాలనే ఆసక్తి రాలేదు.

అప్పుడే సడెన్‌గా తమ్ముడు కాల్ చేసి,

“స్వరూప్ రాత్రి బెంగళూరుకు బయలుదేరుతున్నాడు. నువ్వు అతనితో వస్తాను అంటే, నీకు కూడా టికెట్ బుక్ చేస్తాడు” అన్నాడు.

అది నేను అసలు ఊహించలేదు!

స్వరూప్ అంటే నా తమ్ముడి భార్య అన్నయ్య.

అతను చంద్రగిరిలో ఉంటాడు.

ప్లాన్ ఇలా ఫిక్స్ అయింది:

నేను తిరుపతిలో బెంగళూరు బస్ ఎక్కాలి → అదే బస్‌లో స్వరూప్ చంద్రగిరిలో ఎక్కాలి.

ఆ ప్లాన్ నాకు నచ్చింది. కానీ ఒక చిన్న సందేహం —

తిరుపతిలో నన్ను బస్ ఎక్కించడానికి ఎవరైనా అందుబాటులో ఉంటారా?

అని ముందుగా కన్ఫర్మ్ చేసుకోవాలని ఇద్దరికీ కాల్ చేశాను.

అందులో బ్యాంక్ కంప్యూటర్ ఇంజనీర్ రవి అన్న

“నేను వచ్చి బస్ ఎక్కిస్తాను” అన్నాడు.

అంతే — ప్లాన్ కన్ఫర్మ్!

 బెంగళూరుకు బయలుదేరడానికి సిద్ధమవుతుండగా, బయట ఒక్కసారిగా శబ్దం వినిపించింది.

మొదట ఏమిటో అర్థం కాలేదు.

డౌట్‌తో — అదే ఉండవచ్చేమో అనిపించి జాగ్రత్తగా విన్నాను.

నా అనుమానం కరెక్ట్ అయింది!

అదే!

వర్షం పడుతోంది! 🌧️

తిరుపతిలో వర్షం చూసి 3–4 నెలలు అయ్యింది.

నేను బయలుదేరే సమయానికే వర్షం రావడం… 😔

రాత్రి 10:15కి రవి అన్న ఇంటికి వచ్చి,

నేను ఎక్కాల్సిన బెంగళూరు బస్‌ నన్ను ఎక్కించాడు.

11 గంటలకు బస్ బయలుదేరింది.

11:27కి చంద్రగిరిలో స్వరూప్ ఎక్కాడు.

అక్కడి నుంచి ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా కళ్లుమూసి నిద్రపోయాను.

తెల్లవారుజామున 3:20కి,

“మనము దిగాల్సిన ప్లేస్ దగ్గరపడుతోంది” అని స్వరూప్ చెప్పడంతో,

ఇద్దరం కలిసి బెంగళూరు అవుట్‌స్కర్ట్స్‌లోని హోస్కోటె టోల్ గేట్ దగ్గర దిగాం.

దిగగానే ఆటో వాళ్లు “ఎక్కడికి వెళ్లాలి?” అని అడిగారు.

స్వరూప్ “వస్తున్నారు” అని చెప్పాడు.

ఒక నిమిషం లోపలే తమ్ముడు, తమ్ముడి భార్య కారులో వచ్చారు —

మమ్మల్ని పికప్ చేసుకోవడానికి.

ట్రాఫిక్ లేకపోవడంతో కేవలం 15 నిమిషాల్లోనే ఇంటికి చేరుకున్నాం.

“ఇదే డే టైమ్ అయితే కనీసం ఒక గంట పట్టేది” అని తమ్ముడు చెబుతూ వచ్చాడు.

ఇంటికి వెళ్లగానే పడుకున్నాను.

ఉదయం 9 తర్వాత లేచి ఉగాది సెలబ్రేషన్స్‌కు రెడీ అయ్యాను. 🌿✨

ఆ రోజు మొత్తం తినడం, నిద్రపోవడం ఇలా గడిచింది.

సాయంత్రం నేను, తమ్ముడి భార్య హారిక — మేము ముగ్గురం ఇంటికి దగ్గరలో వాకింగ్‌కు వెళ్లాం.

అప్పుడు అక్కడ ఉన్న ఒక అపార్ట్మెంట్ సేల్స్ అడ్వర్టైజ్‌మెంట్ గురించి తమ్ముడు చెప్పాడు —

విని నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది!

ఒక్క స్క్వేర్ ఫీట్ ధర 7000 రూపాయల కంటే తక్కువట! 😲

తిరుపతి రేటుతో పోల్చి చూస్తే,

అలాంటి ధర వినగానే కొంచెం నమ్మలేకపోయాను…

బెంగళూరులో ఇంత తక్కువకు, అదీ మంచి ఏరియాలో ఫ్లాట్ దొరుకుతుందా? అని నిజంగానే ఆశ్చర్యపోయాను.

---

 ఇంటికి వచ్చి డిన్నర్ చేసి,

నిద్ర రాక “Made in Korea” చూశాను.

మరుసటి రోజు (శుక్రవారం) అందరికీ వర్కింగ్ డే కావడంతో,

నేను మాత్రం తినడం, నిద్రపోవడమే చేశాను 😄

మిగతావాళ్లు ల్యాప్‌టాప్‌లో ఆఫీస్ వర్క్ చేస్తూ,

ఇంటి పనులు కూడా చూసుకున్నారు.

వాళ్లంతా బిజీగా ఉండగా,

నేను మాత్రం ఫుల్ రిలాక్స్ మోడ్‌లో ఉన్నాను 😌

అప్పుడు నా మనసులో ఏర్పడిన ఫీలింగ్:

తిరుపతిలో 1200+ sqft ఫ్లాట్‌లో,

నా రూమ్‌లో నాలుగు గోడల మధ్య ఒంటరిగా ఉండడం

ఎప్పుడూ నాకు లొన్లీనెస్ అనిపిస్తుంది…

కానీ బెంగళూరులో చిన్న 500 sqft ఇంట్లో

ఉన్నంతసమయం చాలా సంతోషంగా అనిపించింది.

ఇక్కడ స్పేస్ పెద్దదా, చిన్నదా అన్నది కాదు…

మన చుట్టూ ఉన్న వాళ్లు, వాళ్లు ఎలాంటి వాళ్లు అన్నదానిపైనే

మనకు హ్యాపీనెస్ ఏర్పడుతుందని అర్థమైంది 🙂

సాయంత్రం 3:10కి

నేను, తమ్ముడు, తమ్ముడి భార్య హారిక,

హారిక అన్నయ్య స్వరూప్ — నలుగురం కలిసి

తమ్ముడి కారులో తిరుపతికి బయలుదేరాం. 🚗

ట్రాఫిక్ తక్కువగా ఉండడంతో అనుకున్న టైమ్ కంటే త్వరగా హోస్కోటె టోల్ గేట్ చేరాం.

సుమారు 7:10కి చంద్రగిరి చేరుకున్నాం.

స్వరూప్ వాళ్ల ఇంట్లో డిన్నర్ చేసి,

నేను, తమ్ముడు, తమ్ముడి భార్య హారిక — ముగ్గురం ఇంటికి బయలుదేరాం.

ఇంటికి వచ్చాక, నా బ్యాగ్‌లోని వస్తువులు తీస్తూ ఉండగా,

 ఒక విషయం గుర్తొచ్చింది… 😄

రెండు రోజుల బెంగళూరు ట్రిప్‌కు

నేను ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు అన్న విషయం!

నిజం చెప్పాలంటే, నేను ట్రావెల్ చేయాలంటే

ఖర్చు గురించి ఎప్పుడూ ఆలోచించను…

కానీ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్‌లో కొంత స్ట్రెస్ మాత్రం ఉంటుంది.

ఈసారి మాత్రం:

✔ స్ట్రెస్ లేదు

✔ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు

✔ పూర్తిగా హ్యాపీ ట్రిప్ 😊

ఇలాంటి ఒక ట్రిప్ నాకు కుదురుతుందని

అసలు ఊహించలేదు! 🙂

---

తిరుపతి మహేష్

21/03/2026

Comments

Popular posts from this blog

మీతో పంచుకోవాలనుకున్న ఒక సంతోషకరమైన విషయం…... Welcome to My...

తప్పు ఎవరిదైనా… చివరికి నష్టపోయేది మాత్రం...

ఒక తండ్రి మనసు…

రెండు సంవత్సరాల క్రితం… సరిగ్గా ఈ రోజు: మేము ఇల్లు మారిన కథ

అగ్నిపరీక్ష

దీక్ష భగ్నం అయింది… My Lord!

మూడవ సంవత్సరం…

ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబం… ఇంకా ఉన్నాయా?

💊 పారాసిటమాల్ అంటే అది ఒక మాత్ర కాదు… అది ఒక...

ఆడియో డిస్క్రిప్షన్‌తో కనిపించిన కొత్త ప్రపంచం… స్ట్రెస్‌తో నా పోరాటం