Good morning from Bengaluru!

సరిగ్గా రెండు రోజుల క్రితం, మంగళవారం ఉదయం నుంచే నాకు ఒకరకమైన స్ట్రెస్, తలనొప్పి మొదలైంది. అయినా కూడా ఆ రోజు మొత్తం బ్యాంక్‌లో పని చేశాను.

చివరి నిమిషంలో బుధవారం లీవ్ పెట్టాలని అనిపించింది. నిన్న ఉగాది, ఈ రోజు రమ్జాన్ ఉండటంతో — రేపు ఒక్క రోజు లీవ్ పెడితే నాలుగు రోజులు కలిసి వస్తాయని ముందే ప్లాన్ చేసుకున్నాను. కానీ మధ్యలో ఆరోగ్యం బాగోలేకపోవడంతో బుధవారం కూడా లీవ్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.

మంగళవారం సాయంత్రం నేను పనిచేసే బ్రాంచ్ చీఫ్ మేనేజర్‌కి నా పరిస్థితి చెప్పి లీవ్ అడిగాను. ఆయన గురించి నాకు బాగా తెలుసు — ఆయన లీవ్ పెట్టరు, ఇతరులు లీవ్ పెట్టడం కూడా ఆయనకు అసలు నచ్చదు. అయినా నా పరిస్థితి వివరంగా చెప్పాను:

“సర్, ఉదయం నుంచే బాగా లేను. రేపు లీవ్ కావాలి. అలాగే ఉగాది, రమ్జాన్ కారణంగా గురువారం, శుక్రవారం హాలిడేస్ ఉన్నాయి. శనివారం ఒక రోజు లీవ్ పెడితే నాలుగు రోజులు కలిసివస్తాయి. ట్రిప్‌కు వెళ్లాలని ప్లాన్ చేశాను సర్” అని చెప్పాను.

అంతే… నేను ఏదో తప్పు చేసినట్టుగా నన్నే తప్పుబట్టడం ప్రారంభించారు. నాకు అది నచ్చలేదు. కానీ ఆయన నా బాస్ కావడంతో సహించాల్సి వచ్చింది.

బుధవారం ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకున్నాను. కొంతవరకు తలనొప్పి తగ్గింది.

ఆ రోజు రాత్రి బెంగళూరులో ఉండే నా తమ్ముడు ఇంటికి బయలుదేరాను. బస్ ప్రయాణం నైట్ జర్నీ కావడంతో నిద్ర డిస్టర్బ్ అయింది. అందుకే నిన్న మొత్తం బాగా విశ్రాంతి తీసుకున్నాను.

నిన్న ఉదయం పూజ చేసి, తమ్ముడు మరియు తమ్ముడి భార్య ఇద్దరూ కలిసి చేసిన ఉగాది పచ్చడి తిని, ఉగాది పండుగను ఆనందంగా జరుపుకున్నాము.

రాత్రి డిన్నర్ తర్వాత నిద్ర రాకపోవడంతో, 10 రోజుల క్రితం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన “మేడ్ ఇన్ కొరియా” సినిమా చూడాలని అనిపించి చూడటం ప్రారంభించాను. ముందే ఒక గంట వరకు చూసినా అప్పట్లో అంతగా కనెక్ట్ కాలేకపోయాను. కానీ ఈ సినిమాకు ఆడియో డిస్క్రిప్షన్ ఉందని తెలిసిన క్షణంలో నాకు కళ్లలో నీళ్లు వచ్చాయి. అప్పుడే అనుకున్నాను — టైమ్ దొరికినప్పుడు మళ్లీ మొదటి నుంచి పూర్తిగా చూడాలి అని. ఆ అవకాశం నిన్న రాత్రి వచ్చింది.

---

తమిళనాడులోని కన్యాకుమారి దగ్గర ఉన్న కొలప్పూర్ అనే గ్రామంలో శెన్బగం అనే అమ్మాయికి కొరియా వెళ్లాలనే ఒక కల ఉంటుంది. అలాగే ఆమె తన ఊరిలోనే మణి అనే అబ్బాయిని ఇష్టపడుతుంది. ఒక దశలో వారి ప్రేమను ఇంటివారు అంగీకరించకపోవడంతో ఇద్దరూ చెన్నైకి వెళ్తారు.

శెన్బగం కల నెరవేర్చాలని మణి చెప్పి, ఇద్దరూ కలిసి కొరియా వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాడు. కానీ ఫ్లైట్ ఎక్కే రోజు మణి రాడు. శెన్బగం మాత్రం ఒంటరిగానే కొరియాకు వెళుతుంది.

ఆ తర్వాత ఆమె అక్కడ ఎలా జీవించింది? ఎలా నిలబడింది? ఆమె ఊరిలో ఉన్న తల్లిదండ్రుల పరిస్థితి ఏమైంది? తనతో వస్తానని చెప్పిన మణి ఏమయ్యాడు? — ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా తప్పకుండా చూడాలి.

మొదట్లో ఏదో అనిపించినా, తర్వాత హీరోయిన్ భావోద్వేగాలకు చాలా ఈజీగా కనెక్ట్ అయ్యాను. చాలా చోట్ల నేను కన్నీళ్లు పెట్టుకున్నాను. ఇది ఒక ఫీల్-గుడ్ ఎమోషనల్ డ్రామా.

సినిమాలో కొరియాలో ఒక వృద్ధ మహిళ పాత్ర ఉంటుంది. గత 10 రోజులలో నేను మాట్లాడిన ఇద్దరు 60+ వయసు ఉన్న మహిళలు తమ కలలు నెరవేర్చుకోలేకపోయామని చెప్పిన సందర్భం నాకు గుర్తొచ్చింది. ఆ పాత్రతో నాకు బాగా రిలేట్ అయింది.

నెట్‌ఫ్లిక్స్‌లో ఆడియో డిస్క్రిప్షన్ ఉండటం వల్ల ఈ సినిమాను పూర్తిగా ఆస్వాదించగలిగాను.

సినిమాలో ఒక డైలాగ్ నాకు చాలా బాగా నచ్చింది:

“ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు, ఆ బాధను చెప్పుకోవడానికి ఎవరూ లేకపోతే, ఆ బాధ ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది.”

అలాగే సినిమా చివర్లో హీరోయిన్‌ను మోసం చేసిన లవర్ తిరిగి వచ్చి ‘సారీ’ చెప్పినప్పుడు, ఆమె అతనికి ‘థాంక్స్’ చెబుతూ — “ఇవన్నీ నీ వల్లే జరిగాయి” అని చెప్పడం చాలా ఎమోషనల్‌గా అనిపించింది.

మొత్తానికి, “మేడ్ ఇన్ కొరియా” ఒక మంచి భావోద్వేగ అనుభూతిని ఇచ్చిన సినిమా. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది — మిస్ అవ్వకండి.

---

తిరుపతి మహేష్

20/03/2026     

Comments

Popular posts from this blog

మీతో పంచుకోవాలనుకున్న ఒక సంతోషకరమైన విషయం…... Welcome to My...

తప్పు ఎవరిదైనా… చివరికి నష్టపోయేది మాత్రం...

ఒక తండ్రి మనసు…

రెండు సంవత్సరాల క్రితం… సరిగ్గా ఈ రోజు: మేము ఇల్లు మారిన కథ

అగ్నిపరీక్ష

దీక్ష భగ్నం అయింది… My Lord!

మూడవ సంవత్సరం…

ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబం… ఇంకా ఉన్నాయా?

💊 పారాసిటమాల్ అంటే అది ఒక మాత్ర కాదు… అది ఒక...

ఆడియో డిస్క్రిప్షన్‌తో కనిపించిన కొత్త ప్రపంచం… స్ట్రెస్‌తో నా పోరాటం