💊 పారాసిటమాల్ అంటే అది ఒక మాత్ర కాదు… అది ఒక...

పారాసిటమాల్ అనే పేరు ప్రతి ఒక్కరికీ చాలా పరిచయం అయినది. చిన్నప్పటి నుంచి జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా — “పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది” అని నేను చాలా సార్లు విన్నాను… మీరు కూడా విని ఉంటారు.

కానీ గత కొన్ని సంవత్సరాలుగా “పారాసిటమాల్” కంటే “డోలో” అనే పేరు ఎక్కువగా వినిపించడం మొదలైంది. ఎందుకు పారాసిటమాల్ బదులు డోలో ఎక్కువగా వాడుతున్నారు అనే విషయం గురించి నేను పెద్దగా ఆలోచించలేదు.

జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా — ఒక డోలో 650 వేసుకుంటే సరిపోతుంది అని చాలామంది చెబుతుంటారు. ఇంకా కొందరు అయితే తలనొప్పి వస్తే వెంటనే వేసుకోవడానికి బ్యాగ్‌లోనే టాబ్లెట్ పెట్టుకుని తిరుగుతారు.

నేను కూడా చాలా సార్లు తట్టుకోలేని తలనొప్పి వచ్చినప్పుడు డోలో 650 వేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ దాని గురించి లోతుగా తెలుసుకోవాలని నాకు అనిపించలేదు.రెండు రోజుల క్రితం నేను రాసిన బ్లాగ్‌లో…

నాకు psoriasis skin problem ఉందని చెప్పాను. 2019 ఆగస్టు నుంచి చెన్నైలో గ్రీమ్స్ రోడ్‌లో ఉన్న అపోలో హాస్పిటల్‌లో పనిచేస్తున్న సీనియర్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ మురళీధర్ రాజగోపాలన్ గారి దగ్గర చికిత్స తీసుకుంటున్నాను అని కూడా చెప్పాను.

చివరిసారిగా 2024 జూలైలో ఆయనను కలిశాను. ఆ తర్వాత చెన్నైకి వెళ్లే పరిస్థితి నాకు లేకపోవడంతో ఆయన ఇచ్చిన మందులను ఆన్లైన్‌లో కొనుగోలు చేసి కొన్ని నెలలు వాడాను.

కానీ సమస్య తగ్గకపోవడంతో తిరుపతిలో మంచి డెర్మటాలజిస్ట్ కోసం వెతకడం ప్రారంభించాను. అలా గత సంవత్సరం డిసెంబర్ చివరి వారంలో డాక్టర్ నీలిమ పార్లపల్లి గారిని కలిశాను.

చివరిసారి గత శనివారం, ఏప్రిల్ 11న వెళ్లినప్పుడు ఆమె “స్ట్రెస్ ఉండకూడదు, మెడిటేషన్ చేయాలి” అని చెప్పారు. కానీ నేను స్ట్రెస్ నుంచి  తప్పించుకోలేను అని నాకు బాగా తెలుసు. ఎందుకంటే నా చుట్టూ ఉన్న వాతావరణం మరియు మనుషుల వల్ల నా లోపల ఏర్పడే స్ట్రెస్ నుంచి 

నేను ఎప్పటికీ పూర్తిగా బయటపడలేను.

ఇంకా చెప్పాలంటే… చివరి వరకు స్ట్రెస్‌తో సహజీవనం చేస్తూ పోవాల్సిందే అని నాకు బాగా తెలుసు 😄

అలాగే ప్రతిరోజూ మెడిటేషన్ చేయడం కూడా అంత సులభమైన విషయం కాదు.

 మెదడులో ఏర్పడుతున్న ఆలోచనలను పూర్తిగా ఆపడం అనేది అంత ఈజీ కాదు.

కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను — ఇప్పటివరకు నేను తీసుకున్న మందుల గురించి ముందుగా ఒక అవగాహన తెచ్చుకోవాలి. వాటిని డాక్టర్లు ఎందుకు ఇచ్చారు? అవి ఎలా పనిచేస్తాయి? అన్న విషయాలను నేనే తెలుసుకోవాలి అని నిర్ణయించుకుని, ఆ దిశగా నేర్చుకోవడం ప్రారంభించాను.

---

నిన్న ఉదయం ఇంటి నుంచి బ్యాంక్‌కి బయలుదేరేటప్పుడే నా వెంట, నేను చెన్నై మరియు తిరుపతిలో ట్రీట్మెంట్ తీసుకున్న డాక్టర్ల ఫైల్స్ కూడా తీసుకెళ్లాను.

సాయంత్రం బ్యాంక్ అయ్యాక, తిరుపతి నిమ్మకాయల వీధిలో ఉన్న నా మేనమామ మొక్కల మునిరెడ్డి గారి ఇంటికి వెళ్లాను. అక్కడ ఆయన కుమారుడు కౌశిక్‌కి ఆ ఫైల్స్ ఇచ్చి, ఇప్పటివరకు డాక్టర్లు నాకు ప్రిస్క్రైబ్ చేసిన అన్ని మందుల పేర్లను laptop ‌లో టైప్ చేసి నాకు మెయిల్ పంపమని చెప్పాను.

కౌశిక్ అరగంటలోనే ఆ పని పూర్తి చేసి నాకు మెయిల్ పంపించాడు.

రాత్రి ఇంటికి వచ్చాక, ఇప్పటివరకు నేను వేసుకున్న ఒక్కో మందు గురించి గూగుల్‌లో సెర్చ్ చేసి, వాటి గురించి తెలుసుకోవడం ప్రారంభించాను.

ఇన్ని రోజులు నేను చేసినది ఏమిటంటే — డాక్టర్ వద్దకు వెళ్లి వారు ఇచ్చిన మందులు వాడడం మాత్రమే చేశాను. కానీ ఆ మందులను డాక్టర్లు ఎందుకు ప్రిస్క్రైబ్ చేశారు? ఆ మెడిసిన్ గురించి ఏమిటి అనేది తెలుసుకోకుండా ఉన్నాను.

కానీ ఇకపై… “నాకు ఉన్న చర్మ సమస్యను నేను అర్థం చేసుకుని, నా వంతుగా ట్రీట్మెంట్‌కు ఎలా సహకరించాలి?” అనే దిశగా మొదటి అడుగులు వేయడం ప్రారంభించాను.

---

ఇప్పటివరకు నేను చూసిన ఇద్దరు డాక్టర్ల ప్రిస్క్రిప్షన్స్‌లో Methotrexate మరియు Apremilast అనే మందులు ఎక్కువగా వాడినట్టు గమనించాను. వాటి గురించి నేను ఏమి తెలుసుకున్నానో మీతో పంచుకునే ముందు, ముందుగా “డ్రగ్ అంటే ఏమిటి?” అనే విషయం మీరు తెలుసుకోవాలి అనిపించింది.

అందుకే నా పర్సనల్ స్టోరీని మీతో షేర్ చేసుకున్నాను. ఇప్పుడు బ్లాగ్ టైటిల్‌కు సంబంధించిన అసలు విషయానికి — పారాసిటమాల్‌కి వస్తాను. ఇంతసేపు నేను నా విషయం ఎందుకు చెప్పాను అంటే, “మందు అంటే ఏమిటి?” అనే ఒక ప్రాథమిక అవగాహన మీకు ఇవ్వడానికే. అందుకే అందరికీ తెలిసిన పారాసిటమాల్‌తోనే ప్రారంభిస్తున్నాను.

మొదటగా మీరు తెలుసుకోవాల్సింది — పారాసిటమాల్ అంటే టాబ్లెట్ కాదు… అది ఒక ఔషధం (డ్రగ్). డ్రగ్ అంటే మన శరీరంలో ఉన్న వ్యాధులను తగ్గించడానికి లేదా నివారించడానికి ఉపయోగించే పదార్థం. ఉదాహరణకు పారాసిటమాల్ జ్వరం, తలనొప్పిని తగ్గిస్తుంది. అలాగే ఇన్సులిన్ రక్తంలో షుగర్ స్థాయిని నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. నాకు ఉన్న చర్మ సమస్య (psoriasis) కోసం డాక్టర్లు Methotrexate మరియు Apremilast అనే డ్రగ్స్‌ను ఉపయోగిస్తున్నారు.

ఒక డ్రగ్ ఎలా తయారవుతుందంటే — పెద్ద పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో పనిచేసే శాస్త్రవేత్తలు కొత్త డ్రగ్‌ను కనుగొంటారు. దానిపై క్లినికల్ ట్రయల్స్ చేస్తారు. దాని సేఫ్టీ, సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ పరిశీలిస్తారు. ఆ తర్వాత ప్రభుత్వ అనుమతి పొందిన తరువాతే ఆ డ్రగ్‌ను పెద్ద స్థాయిలో తయారు చేసి మార్కెట్‌లోకి తీసుకువస్తారు. భారతదేశంలో Sun Pharma, Dr. Reddy’s, Cipla, Aurobindo

వంటి ప్రముఖ కంపెనీలు ఉన్నాయి.

జ్వరం వచ్చినప్పుడు మనం నోటిద్వారా మింగేది “టాబ్లెట్” మాత్రమే. కానీ అందులో ఉన్న అసలు పదార్థం “పారాసిటమాల్” అనే ఔషధం. ఈ ఔషధం టాబ్లెట్స్, క్యాప్సూల్స్, సిరప్స్, ఇంజెక్షన్స్ వంటి వేర్వేరు రూపాల్లో ఉంటుంది.

Dolo, Crocin వంటి పేర్లు విన్నప్పుడు అవే వేర్వేరు మందులు అనిపిస్తుంది. కానీ అవన్నీ బ్రాండ్ పేర్లు మాత్రమే. వాటి లోపల ఉన్న అసలు ఔషధం మాత్రం పారాసిటమాల్‌నే. అందుకే మార్కెట్‌లో పేర్లు వేర్వేరుగా ఉన్నా, లోపల ఉన్న మందు మాత్రం ఒకటే.

---

పారాసిటమాల్‌ను మొదటగా 1877లో జర్మనీకి చెందిన శాస్త్రవేత్త Harmon Northrop Morse కనుగొన్నారు.

అయితే ఇది విస్తృతంగా మందుగా వాడటం 1950లలో ప్రారంభమైంది. భారతదేశంలో 1960–70 మధ్య కాలంలో ప్రాచుర్యం పొందింది.

ఇలా చూస్తే, ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి చివరి వరకు ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు మెరుగైన చికిత్స కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త డ్రగ్స్‌ను కనుగొంటూనే ఉన్నారు.

---

ఈ బ్లాగ్ ఇక్కడివరకు మీరు చదివి ఉంటే… నేను చెప్పాలనుకున్న విషయం మీకు అర్థమైందని అనుకుంటున్నాను.

మీరు ఇకపై ఎప్పుడైనా ఆరోగ్య సమస్య కోసం డాక్టర్‌ను కలిసినప్పుడు, వారు ప్రిస్క్రైబ్ చేసిన టాబ్లెట్ పేరు ఒకసారి గూగుల్‌లో సెర్చ్ చేయండి.

అలా చేస్తే ఆ మందు పేరు, అందులో ఉన్న రసాయన పదార్థాలు (chemical ingredients), ఆ డ్రగ్ యొక్క కాంపోజిషన్, అలాగే అది ఎందుకు వాడుతున్నారు అన్న విషయాలు మీకు తెలుస్తాయి.

ఇలా కొంచెం అవగాహనతో మందులు వాడడం ప్రారంభించండి…

నేను ఇప్పుడు మొదలుపెట్టినట్లే 🙂

— తిరుపతి మహేష్

14/04/2026

Comments

Popular posts from this blog

మీతో పంచుకోవాలనుకున్న ఒక సంతోషకరమైన విషయం…... Welcome to My...

తప్పు ఎవరిదైనా… చివరికి నష్టపోయేది మాత్రం...

ఒక తండ్రి మనసు…

రెండు సంవత్సరాల క్రితం… సరిగ్గా ఈ రోజు: మేము ఇల్లు మారిన కథ

అగ్నిపరీక్ష

దీక్ష భగ్నం అయింది… My Lord!

మూడవ సంవత్సరం…

ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబం… ఇంకా ఉన్నాయా?

ఆడియో డిస్క్రిప్షన్‌తో కనిపించిన కొత్త ప్రపంచం… స్ట్రెస్‌తో నా పోరాటం