దీక్ష భగ్నం అయింది… My Lord!

ఏప్రిల్ 1 — Annual Closing Day సందర్భంగా, నిన్న మా బ్రాంచ్ మేనేజర్ బ్రాంచ్‌లో పనిచేసే అందరికీ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు.

గురువారం సాయంత్రం నుంచే “చికెన్, మటన్, ఫిష్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి” అని తెలిసినప్పటి నుంచి ఒక వైపు తినాలనే కోరిక… మరో వైపు “కొన్ని రోజులు నాన్‌వెజ్, ముఖ్యంగా చికెన్-మటన్ తినకూడదు” అన్న నా నిర్ణయం… నాలో ఒక చిన్న యుద్ధం మొదలైంది 🙂

నిన్న ఉదయం బ్యాంక్‌కి వెళ్లే ముందుఅగ్నిపరీక్ష

అనే టైటిల్‌తో ఒక బ్లాగ్ కూడా రాశాను.

(ఆ బ్లాగ్ ఇంకా చదవకపోతే, ముందుగా అది చదివి తర్వాత ఇది చదవండి — continuation ఇంకా బాగా అర్థమవుతుంది.)

---

ఎప్పటిలాగే నిన్న ఉదయం 9:30కి Rapido బుక్ చేసి బ్యాంక్‌కి వెళ్తే,

నాకన్నా ముందే షబానా వచ్చి తన సీట్లో ఉంది.

“Good morning షబానా” అని నేను చెప్పగానే,

“నిన్న function కి మీరు రాలేదేంటి సర్?” అని అడిగి,

గత సంవత్సరం తన marriage కి కూడా నేను attend కాలేదని గుర్తుచేసింది.

అది వినగానే నాకు కొంచెం guilty గా అనిపించింది.

ఆ సమయానికి ఏదో ఒకటి చెప్పి ఆ టాపిక్‌ను divert చేశాను.

షబానాకి next month 20th delivery date ఇచ్చారు doctors.

కానీ కొంచెం complications ఉండటంతో,

డాక్టర్ ఆమెకు leave తీసుకుని rest తీసుకోవాలని strict recommendation letter కూడా ఇచ్చారు.

ఆ letter తీసుకుని, తన boss — Tirupati SBI Securities Sales Manager — కు పంపింది.

కానీ ఎలాంటి response రాలేదు.

మొదట April 13 నుంచే maternity leave తీసుకోవాలని అనుకుంది.

కానీ ఆమె boss,

“గుంటూరులో ఉన్న Zonal Manager మంచి mood లో ఉన్నప్పుడు చెప్పి, ఈ నెల చివరి నుంచి maternity leave ఇస్తాను” అని చెప్పారు — అది నేను చెవులారా విన్నాను.

---

గత వారం రెండో శనివారం, ఆదివారం సెలవుల తర్వాత, సోమవారం ఉదయం బ్యాంక్‌కి వెళ్లాక…

కొంతసేపటికి షబానా ఏడుస్తోంది అని పక్కన ఉన్న వాళ్లు చెప్పాక తెలిసింది.

“ఏమైంది షబానా? ఎందుకు ఏడుస్తున్నావు?” అని అడిగాను.

ఏం మాట్లాడలేదు…

ఎక్కి ఎక్కి తనలోనే ఏడుస్తుండడం మాత్రం నాకు వినిపించింది.

మొదట personal problem ఏదైనా ఉండొచ్చని అనుకుని, ఎంత అడిగినా చెప్పకపోవడంతో నేను కూడా silent అయిపోయాను.

కానీ తర్వాత తెలిసింది —

ఆ రోజు షబానాకి severe back pain, fever కూడా ఉన్నప్పటికీ branch కి వచ్చింది.

“Leave తీసుకుని ఇంటికి వెళ్లిపో” అని చెప్పినా,

తన boss (Sabeer) కి భయపడి

రోజంతా branch లోనే పని చేసి,

సాయంత్రం doctor దగ్గరకు వెళ్లింది.

ఆ రోజు షబానా పరిస్థితి చూసి నాకు చాలా బాధ వేసింది…

అదే సమయంలో ఆమె boss మీద చాలా కోపం కూడా వచ్చింది.

---

మన దేశంలో చాలా మంది contract / outsourcing / private jobs చేస్తున్న వాళ్ల పరిస్థితి చూస్తే,

“dignity of work” అనే మాట వాళ్లకు అసలు దొరకడంలేదని అనిపిస్తుంది.

నేను చూసినంతవరకు SBI Securities మాత్రమే కాదు, SBI Cards లో కూడా ఇదే పరిస్థితి.

targets మాత్రం రోజూ achieve చేయాలి…

leave మాత్రం అడగకూడదు.

ఇంతకీ మా బ్రాంచ్ Chief Manager కూడా అంతే.

ప్రతిరోజూ మేము customers నుంచి complaints రాకుండా పని చేసి వెళ్లాలి;

కానీ అవసరానికి leave అడిగితే మాత్రం ఆయనకి నచ్చదు.

సాధారణంగా నాకు leave కావాలంటే,

అవసరం ఉన్న రోజున ఉదయం Chief Manager కి message చేసి, HRMS portal లో leave apply చేయడం నా అలవాటు.

గత నెల శ్రీరామనవమి, రంజాన్ వరుసగా సెలవులు రావడంతో,

మధ్యలో ఒక రోజు leave పెడితే ఆదివారంతో కలిపి నాలుగు రోజులు వస్తాయని అనిపించింది.

 ఈసారి ముందే చెప్పాను.

అంతే…

“ఎప్పుడూ ఇలా public holidays కి ముందు–వెనుక రోజులు చూసుకుని leave పెడతావు” అంటూ lecture మొదలైంది.

Professional life ఎంత ముఖ్యమో, personal life కూడా అంతే ముఖ్యం sir అని నేను చెప్పితే,

“నాకు కూడా leaves ఉన్నాయి… mandatory leaves కూడా ఉన్నాయి… కానీ నేను తీసుకోను” అని చెప్పారు.

మనసులో — మీరు leave తీసుకోవడం, తీసుకోకపోవడం — అది మీ ఇష్టం అనుకుని,

బయటికి మాత్రం “నాకు అవసరం ఉంది” అని చెప్పి leave తీసుకున్నాను.

2024 ఏప్రిల్ 1న ఆయన Municipal Road బ్రాంచ్‌లో report చేశారు.

అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన కేవలం మూడు రోజులు మాత్రమే leave తీసుకున్నారు.

అలానే తనకింద పనిచేసే మేము కూడా ఆయనలాగే leave తీసుకోకుండా ఉండాలని expect చేయడం —

ఆ attitude ఎవరికీ నచ్చదు.

---

చెప్పాలంటే, నేను bank లో చేరినప్పటి నుంచి weekend కి ముందు లేదా వెనుక ఒక public holiday వస్తే,

extra గా ఒక రోజు leave పెట్టుకుని చాలా trips వెళ్లాను.

కొత్త కొత్త ప్రదేశాలకు travel చేయడం నాకు చాలా ఇష్టం.

ఇప్పటివరకు 5 దేశాలు…

మరియు భారతదేశంలో 15 రాష్ట్రాల్లో ముఖ్యమైన tourist places చూసాను.

అదీ travel agent తో కాకుండా,

సొంతంగా నేనే plan చేసుకుని,

నా తమ్ముడిని తోడుగా తీసుకుని వెళ్లడం — అది ఒక ప్రత్యేకమైన ఆనందం.

Travel చేయడం మాత్రమే కాదు, తిరిగి వచ్చాక travel blogs, travel series రాయడం కూడా నాకు ఎంతో ఇష్టం.

నా జీవితంలో ultimate కోరిక —

కొత్త కొత్త ప్రదేశాలు, దేశాలకు life long travel చేస్తూ ఉండాలని.

కానీ గత 3 సంవత్సరాలుగా నా ప్రయాణాలు కూడా తగ్గిపోయాయి.

ఏదో చెప్పాలనుకుని ఈ blog మొదలుపెట్టాను…

అది అలా ఎక్కడికో వెళ్లిపోయింది 🙂

---

నిన్న శుక్రవారం కావడంతో ఏమో… నా కౌంటర్ దగ్గరకు కస్టమర్లు కూడా సాధారణం కంటే కొంచెం తక్కువగానే వచ్చారు

మధ్యాహ్నం 12 గంటల సమయం ఉండొచ్చు,

సడన్‌గా bank లో పని చేసే సోము నన్ను పిలిచి,“సర్, మీరు non-veg తింటారా?” అని అడిగాడు.

అది నేను అసలు expect చేయలేదు.

నాకు రోజులు, అమావాస్య, పౌర్ణమి, ఏకాదశి ఇలా ఏవి పెద్దగా పట్టించుకునే అలవాటు లేదు.

ఏ రోజైనా non-veg తినే వాడిని.

సోము ఇలా సడన్‌గా అడగడంతో, ఉదయం నేను రాసిన బ్లాగ్ చదివి, లీలా కృష్ణ సర్ వెజ్ వాళ్ల లిస్ట్‌లో నా పేరు చేర్చడానికి కన్ఫర్మ్ చేసుకోవడానికి సోముని అడగమని చెప్పారేమో అనిపించింది.

ఒక సెకండ్ ఆలోచించి,

“non-veg తింటాను” అని సోముకు చెప్పేశాను.

ఆ క్షణం వరకూ ‘ఈరోజు non-veg తినకూడదు’ అని నా లోపల జరుగుతున్న సంఘర్షణ — అక్కడికక్కడే ముగిసిపోయింది 😄

---

మధ్యాహ్నం ఒకటిన్నర సమయం ఉంటుంది.

భోజనం నా counter ముందుగా తీసుకెళ్తుండగా, బిర్యానీ వాసన ముక్కు ద్వారా నేరుగా కడుపుకి చేరి

నోటిలో లాలాజలం ఊరడం మొదలైంది.

ఒక ఐదు నిమిషాల్లోనే, లీలా కృష్ణ సర్ నా కౌంటర్ దగ్గరకు వచ్చి, నా పక్క సీట్లో ఉన్నవారిని ‘వెళ్లి భోజనం చేయండి’ అని చెప్పి… నన్ను స్వయంగా భోజనం ఏర్పాటు చేసిన గదికి తీసుకెళ్లారు.

మొదటి వ్యక్తిగా చేతులు కడుక్కొని కూర్చున్నాక… ముందుగా నాకే వడ్డించారు.

మటన్ బిర్యానీ, ఫిష్ ఫ్రై, చికెన్ గ్రేవీ, గోంగూర బోటి… అన్నీ ప్లేట్‌లో పెట్టుకుని,

‘నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను… ఇబ్బంది వస్తుందేమో’ అని చెప్పిన నేనే… మొదటగా తినడం ప్రారంభించాను.

అది తలుచుకుంటూ నాలో నేనే నవ్వుకుంటూ… కడుపునిండా తృప్తిగా తిని, తిరిగి నా కౌంటర్‌కి వచ్చి కూర్చున్నాను.

అప్పుడే నాకు ఒక సందేహం వచ్చింది—

నాన్-వెజ్ తినే వాళ్లు, దేవుడి పేరు మీద వారంలో కొన్ని రోజులు ఎలా తినకుండా ఉంటారో?

నేను మాత్రం… ఒక్కరోజు తినకూడదని అనుకున్నాను…

కానీ — నా దీక్ష భగ్నం అయింది… My Lord! 😄

---

తిరుపతి మహేష్

18/04/2026 

Comments

Popular posts from this blog

మీతో పంచుకోవాలనుకున్న ఒక సంతోషకరమైన విషయం…... Welcome to My...

తప్పు ఎవరిదైనా… చివరికి నష్టపోయేది మాత్రం...

ఒక తండ్రి మనసు…

రెండు సంవత్సరాల క్రితం… సరిగ్గా ఈ రోజు: మేము ఇల్లు మారిన కథ

అగ్నిపరీక్ష

మూడవ సంవత్సరం…

ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబం… ఇంకా ఉన్నాయా?

💊 పారాసిటమాల్ అంటే అది ఒక మాత్ర కాదు… అది ఒక...

ఆడియో డిస్క్రిప్షన్‌తో కనిపించిన కొత్త ప్రపంచం… స్ట్రెస్‌తో నా పోరాటం