మనసులో జరుగుతున్న పోరాటం...

బ్లాగ్ రాసి చాలా రోజులు అయింది.

ఏదో ఒక విషయం గురించి రాయాలని అనుకుంటాను. కానీ laptop తెరిచి బ్లాగ్ రాయడం మొదలుపెడితే మాత్రం ఆసక్తి ఉండదు.

ఆసక్తి లేకుండా ఏ పని చేసినా అందులో జీవం ఉండదు.

చాలాసార్లు నేను బ్లాగ్ రాయాలని అనుకోవడం జరిగింది. కానీ laptop ఆన్ చేసి కూర్చుంటే ఉత్సాహం, ఆసక్తి కలగకపోవడంతో "రాయడం అవసరమా?" అనిపిస్తుంది. అంతటితో ఆ ఆలోచనను వదిలేసి వేరే పనులు చేసుకుంటాను.

గత శనివారం నా తమ్ముడి మొదటి Marriage Anniversary వెళ్లింది . వారం ముందునుంచే జూన్ 6వ తేదీన ఒక బ్లాగ్ రాయాలని అనుకున్నాను. కానీ చివరకు ఆ బ్లాగ్ కూడా రాయలేకపోయాను.

కానీ ఈరోజు ఉదయం లేవగానే, ఎలాగైనా ఏదో ఒకటి రాయాలి... అనిపించింది.

అలా ఈ బ్లాగ్‌ను మొదలుపెట్టాను.

గత కొన్ని వారాలుగా రోజంతా మానసికంగా అలసిపోయినట్టుగా అనిపిస్తోంది. ఎలాగోలా ఆ విషయాన్ని ఇతరులకు కనిపించకుండా మేనేజ్ చేస్తూ వస్తున్నాను.

ప్రస్తుతం నేను ప్రతిరోజూ ఉదయం లేవడం, రెడీ అవ్వడం, టిఫిన్ తినడం, రాపిడో బుక్ చేసుకుని బ్యాంక్‌కు వెళ్లడం, సాయంత్రం అయ్యాక తిరిగి ఇంటికి రావడం...

ఆ తర్వాత ఎలాగో యూట్యూబ్ చూస్తూనో, లేక ఎవరో ఒకరితో ఫోన్‌లో మాట్లాడుతూనో సమయం గడిచిపోతుంది.

పగటిపూట బ్యాంక్‌లో ఉండడం వల్ల తెలియదు. కానీ సాయంత్రం అయ్యాక ఇంటికి వస్తే...

ఒంటరితనం.

అందుకే సెల్‌ఫోన్ మూలంగా ఆ ఒంటరితనం తెలియకుండా ఉండటానికి ఏదో ఒకటి చేస్తూ ఉంటాను.

ప్రస్తుతం అది కూడా ఒక రకంగా బోర్ కొట్టేసింది.

మనం ఎప్పుడూ ఉత్సాహంగా, సంతోషంగా ఉండాలంటే మెదడులో డోపమైన్, ఆక్సిటోసిన్, సెరోటోనిన్ వంటి రసాయనాలు, హార్మోన్లు తగిన స్థాయిలో ఉత్పత్తి కావాలి. వీటినే "హ్యాపీ హార్మోన్లు" అని కూడా అంటారు. ఇవి మన మెదడులో ఎంత ఎక్కువగా ఉత్పత్తి అయితే అంత ఆరోగ్యంగా, ఉత్సాహంగా, మానసికంగా దృఢంగా, ఆత్మవిశ్వాసంతో ఉంటాం.

కానీ ప్రస్తుతం నా పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఉదయం నుంచి రాత్రి వరకు నా చుట్టూ ఉన్న మనుషులు, పరిస్థితులు, వాతావరణం కారణంగా నాలో కార్టిసోల్ అనే హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతోంది. కార్టిసోల్‌ను "స్ట్రెస్ హార్మోన్" అని అంటారు. ఆందోళన, భయం, నిరంతర ఆలోచనలు, మానసిక ఒత్తిడి వంటి భావోద్వేగాలు దీనిని మరింత పెంచుతాయి.

ప్రస్తుతం నాలో ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగించే హార్మోన్లు తక్కువగా ఉత్పత్తి అవుతుండగా, ఒత్తిడిని పెంచే కార్టిసోల్ మాత్రం ఎక్కువగా ఉత్పత్తి అవుతోంది. ఈ హార్మోన్ల మధ్య సరైన సమతుల్యత లేకపోవడం వల్లనే నేను మానసికంగా నలిగిపోతున్నానేమో అనిపిస్తోంది...

– తిరుపతి మహేష్

12/06/2026 

Comments

Popular posts from this blog

మీతో పంచుకోవాలనుకున్న ఒక సంతోషకరమైన విషయం…... Welcome to My...

తప్పు ఎవరిదైనా… చివరికి నష్టపోయేది మాత్రం...

ఒక తండ్రి మనసు…

Happy Birthday to My Dear…... ❤️

రెండు సంవత్సరాల క్రితం… సరిగ్గా ఈ రోజు: మేము ఇల్లు మారిన కథ

అగ్నిపరీక్ష

వెనక్కి వెళ్లిన అడుగులు… మళ్లీ మేల్కొన్న జ్ఞాపకాలు...

దీక్ష భగ్నం అయింది… My Lord!

ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబం… ఇంకా ఉన్నాయా?

ఒక అమ్మాయి అడిగిన ప్రశ్న