కోవిడ్ సమయంలో కొనాల్సిన SBI షేర్లు... మిస్ అయిన ఒక మంచి అవకాశం..

2022 మేలో ₹7.10

2023 మేలో ₹11.30

2024 మేలో ₹13.70

2025 మేలో ₹15.90

2026 మేలో ₹17.35

గత ఐదు సంవత్సరాల్లో SBI ఒక్కో షేర్‌కు డివిడెండ్ రూపంలో ఇచ్చిన మొత్తం ఇది.

2020 మార్చిలో కోవిడ్ కారణంగా SBI షేర్ ధర సుమారు ₹160 వరకు పడిపోయింది. ఆ సమయంలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి SBI షేర్లు కొనుగోలు చేసి ఉంటే, పెట్టుబడి పెట్టిన మొత్తానికి ఎన్ని షేర్లు వచ్చి ఉండేవో, ఆ షేర్లపై పై పేర్కొన్న డివిడెండ్ మొత్తం ప్రతి సంవత్సరం మే లేదా జూన్ నెలల్లో ఖాతాలో జమ అయ్యి ఉండేది.

అంతేకాదు, ఆ సమయంలో ₹160 వద్ద ఉన్న SBI షేర్ ధర తర్వాత ₹1,234 వరకు పెరిగి, ప్రస్తుతం కూడా సుమారు ₹960 వద్ద కొనసాగుతోంది.

ఒక పక్క షేర్ ధర పెరుగుతూ ఉండటం, ఇంకో పక్క ప్రతి ఆర్థిక సంవత్సరానికి ఒకసారి డివిడెండ్ రావడం... పెట్టుబడిదారులకు అది నిజంగా ఒక మంచి అనుభూతి అయి ఉంటుంది.

2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన SBI డివిడెండ్ ఈరోజు SBI షేర్లు కలిగి ఉన్న వారి ఖాతాల్లో జమ అయింది. అది చూసాక, షేర్ మార్కెట్‌పై అవగాహన నాకు చాలా ముందే వచ్చి ఉంటే బాగుండేదని అనిపించింది. 😔

— తిరుపతి మహేష్

04/06/2026 

Comments

Popular posts from this blog

మీతో పంచుకోవాలనుకున్న ఒక సంతోషకరమైన విషయం…... Welcome to My...

తప్పు ఎవరిదైనా… చివరికి నష్టపోయేది మాత్రం...

ఒక తండ్రి మనసు…

Happy Birthday to My Dear…... ❤️

రెండు సంవత్సరాల క్రితం… సరిగ్గా ఈ రోజు: మేము ఇల్లు మారిన కథ

అగ్నిపరీక్ష

వెనక్కి వెళ్లిన అడుగులు… మళ్లీ మేల్కొన్న జ్ఞాపకాలు...

దీక్ష భగ్నం అయింది… My Lord!

ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబం… ఇంకా ఉన్నాయా?

ఒక అమ్మాయి అడిగిన ప్రశ్న