ఈ మధ్య ఎందుకో...

చెప్పాలంటే గత ఒక వారం నుంచి నా మానసిక ఆరోగ్య పరిస్థితి బాగోలేదు.

I felt mentally exhausted.

కారణం ఇదే అని ఏ ఒక్క దానిని చెప్పలేకపోతున్నాను.

ప్రతిరోజూ ఉదయం లేవడం, బ్యాంక్‌కి వెళ్లడం, సాయంత్రం అయ్యాక ఇంటికి రావడం, ఆ తర్వాత ఇంట్లోనే ఆన్‌లైన్‌లో యోగా క్లాస్‌కు హాజరవడం, ఆ తర్వాత రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్ర వచ్చే వరకు యూట్యూబ్ చూడడమో, ఏదో ఒకటి చదవడమో, లేక బ్లాగ్ రాయడమో చేస్తూ సమయం గడిపేవాడిని.

ఇప్పుడు సాయంత్రం పూట యోగా class attend చేయాలన్నా ఉత్సాహం లేదు.

 బ్యాంక్‌లోనే నా mental energy అంతా drain అయిపోతోంది.

నాకు బ్లాగులు రాయడం అంటే చాలా ఇష్టం. నాకు తెలిసిన విషయాన్నిగానీ, నాలోని భావాన్నిగానీ ఇతరులతో పంచుకోవడం ఒకరకమైన  stress relief ‌గా ఉండేది. కానీ ఇప్పుడు blog రాయాలన్నా కూడా interest రావడం లేదు.

I felt mentally and emotionally very low.

ఈరోజు ఉదయం లేవగానే యూట్యూబ్‌లో చూసిన ఒక వీడియో నన్ను ఎంతో ఆలోచింపజేసింది.

ఒక స్త్రీ కానీ, పురుషుడు కానీ ఎందుకు ఇంకొక వ్యక్తిని ఇష్టపడుతున్నారు? ప్రేమిస్తున్నారు? ఎందుకు తమ జీవితంలో కావాలని కోరుకుంటున్నారు? అనే ప్రశ్నలను ఆ వీడియో లేవనెత్తింది.

"Most human relationships are built on expectations, calculations, and mutual benefit."

నిజానికి ఒక వ్యక్తిని ఇష్టపడటం అంటే, ఏదో ఒక కారణం చేత ఆ వ్యక్తి ద్వారా లభించే అనుభూతి కోసమే. ప్రేమ, ఇష్టం, పెళ్లి అనే పేర్లతో ఒకరికొకరు దగ్గరవుతున్నారు.

నిజం ఏమిటంటే, వ్యక్తిని ప్రేమించడం కంటే ఆ వ్యక్తి ద్వారా కలిగే అనుభూతి కారణంగానే ప్రేమ, పెళ్లి వంటి బంధాల గురించి చెప్పుకోవడం జరుగుతుంటుంది.

ఇది సరా? తప్పా? అని దాని గురించి విశ్లేషించడం ఆ వీడియో ఉద్దేశం కాదు. కానీ మానవ సంబంధాలు, భావోద్వేగాలు, వాటి వెనుక ఉన్న కారణాల గురించి నన్ను లోతుగా ఆలోచించేలా చేసింది.

ఆ వీడియో చూసిన తర్వాత కొంతవరకు నా మనసు కాస్త ప్రశాంతంగా మారింది.

ఆ వీడియోను చూడాలనుకునే వారుఇక్కడ

క్లిక్ చేయండి.

---

తిరుపతి మహేష్

02/06/2026

Comments

Popular posts from this blog

మీతో పంచుకోవాలనుకున్న ఒక సంతోషకరమైన విషయం…... Welcome to My...

తప్పు ఎవరిదైనా… చివరికి నష్టపోయేది మాత్రం...

ఒక తండ్రి మనసు…

Happy Birthday to My Dear…... ❤️

రెండు సంవత్సరాల క్రితం… సరిగ్గా ఈ రోజు: మేము ఇల్లు మారిన కథ

అగ్నిపరీక్ష

వెనక్కి వెళ్లిన అడుగులు… మళ్లీ మేల్కొన్న జ్ఞాపకాలు...

దీక్ష భగ్నం అయింది… My Lord!

ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబం… ఇంకా ఉన్నాయా?

ఒక అమ్మాయి అడిగిన ప్రశ్న