ITR Filing సీజన్ మొదలైంది... Income Tax Portal లో Login అయ్యి చూసారా?

ఈ నెల మొదటి వారం నుంచి నాకు Income Tax ITR Filing కి సంబంధించిన కాల్స్ ఫ్రెండ్స్ నుంచి రావడం మొదలైంది.

ఎప్పుడూ నేనే Income Tax Filing కి సంబంధించిన విషయాల్లో ఆసక్తి చూపించే వాడిని. ఈసారి మాత్రం అంత ఆసక్తి లేదు.

కానీ ఈసారి నా ఫ్రెండ్స్‌లో కొంతమందికి నాకన్నా ముందే ఆ ఆసక్తి వచ్చినట్టుంది.

వారం క్రితం కాల్ చేసి అడిగిన వాళ్ల కోసం Income Tax Portal లో ఈరోజు Login అయ్యి చూశాను.

2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వివరాలు వెబ్‌సైట్‌లో Update అయ్యాయా అని చూస్తే Update అయ్యి ఉన్నాయి.

గత సంవత్సరం మాదిరిగా ITR Filing Due Date ను September 15 వరకు ముందే పొడిగించినట్టు ఈసారి ఎలాంటి Announcement లేదు.

అందువల్ల ఈసారి July 31 లోపే ITR File చేయాలి.

Employees కి Form 16 కొన్ని సంస్థల్లో మాత్రమే ప్రస్తుతం ఇచ్చారు. ఇంకా చాలా సంస్థల్లో ఇవ్వలేదు.

అయినా ముందులా Form 16 పక్కన పెట్టుకుని Income Tax File చేయాల్సిన అవసరం పెద్దగా లేదనిపిస్తోంది.

కారణం — ఇప్పుడు చాలా మంది New Regime లోనే File చేస్తున్నారు. అందులో Exemptions మరియు Deductions ఎక్కువగా ఉండవు.

ఏదో ఒకటి రెండు ఉన్నా అవి కూడా అందరికీ applicable కావు.

కాబట్టి Income Tax Department కి Employer Update చేసిన మీ Salary Income తో పాటు,

మీ Other Sources of Income అయిన

• Savings Bank Interest

• RD / FD Deposit Interest

• Shares Dividend

• Capital Gain Income

• ఇతర ఏవైనా Other Sources of Income మీకు ఉంటే

మీ AIS మరియు TIS లో Update అయ్యి ఉంటే చూసుకుని ITR File చేయండి.

నాకైతే State Bank of India salary, 2025–2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన income 11,20,963 గా Update అయ్యి ఉంది.

Form 16 ఇంకా చేతికి రాలేదు.

వచ్చినా కూడా పైన చెప్పిన అదే Amount అందులో ఉంటుంది.

 Salary కాకుండా నా Other Sources of Income చూస్తే,

నా SBI Savings Account లో నేను maintain చేసిన balance కి గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం నాలుగు సార్లు బ్యాంక్ ఇచ్చిన interest మొత్తం కలిపి 3,059 వచ్చింది.

అలాగే,

ఈ సంవత్సరం January 9న నేను వేసిన  10 లక్షల Fixed Deposit కి March 31 వరకు Update అయిన Interest 16,985.

Employees మరియు Pensioners కి మొత్తం Income 12,75,000 వరకు ఉంటే Tax లేదు.

నాకు వచ్చిన salary, savings bank interest మరియు fixed deposit interest — ఈ మూడు కలిపినా నా income 11.5 లక్షల లోపే ఉండడంతో నేను ఈసారి Tax Pay చేయాల్సిన అవసరం లేదు.

మీరు కూడా ప్రతి సంవత్సరం Income Tax File చేసే వారైతే ఒకసారి Income Tax Portal కి వెళ్లి Login చేయండి.

User Name దగ్గర మీ PAN Number ఇచ్చి Continue పై Click చేయండి.

Income Tax Portal కోసం పెట్టుకున్న Password గుర్తుంటే Type చేసి Login అవ్వండి.

Password గుర్తు లేకపోతే Forgot Password పై Click చేసి కొత్త Password Set చేసుకుని Login అవ్వండి.

 Login అయిన తర్వాత AIS అనే Link పై Click చేసి,

2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన AIS మరియు TIS PDF Files Download చేసుకోండి.

ఆ తర్వాత మీకు ఏమైనా Tax Deduct అయి ఉంటే, ఆ వివరాల కోసం Form 26AS కూడా Income Tax Portal లోనే Download చేసుకుని చూడండి.

అన్నీ Tally అయ్యాకనే Income Tax Return File చేయండి.

Income Tax Filing కి సంబంధించిన మరికొన్ని Blogs రాబోయే రోజుల్లో రాయాలని అనుకుంటున్నాను.

చూడాలి... ఎంతవరకు అది కుదురుతుందో.

— తిరుపతి మహేష్

20/06/2026

Comments

Popular posts from this blog

మీతో పంచుకోవాలనుకున్న ఒక సంతోషకరమైన విషయం…... Welcome to My...

తప్పు ఎవరిదైనా… చివరికి నష్టపోయేది మాత్రం...

ఒక తండ్రి మనసు…

Happy Birthday to My Dear…... ❤️

రెండు సంవత్సరాల క్రితం… సరిగ్గా ఈ రోజు: మేము ఇల్లు మారిన కథ

అగ్నిపరీక్ష

వెనక్కి వెళ్లిన అడుగులు… మళ్లీ మేల్కొన్న జ్ఞాపకాలు...

దీక్ష భగ్నం అయింది… My Lord!

ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబం… ఇంకా ఉన్నాయా?

ఒక అమ్మాయి అడిగిన ప్రశ్న