నాకు అర్థం కాని ఒక విషయం…... ఆ రోజు SBI share ఎందుకు పడిపోయింది?
ప్రతిరోజూ ఉదయం 9:45 కల్లా నేను బ్యాంక్‌కి వెళ్లిపోతాను.
Computer login చేసిన వెంటనే నేను చేసే పని… ఆ రోజు stock market ఎలా ప్రారంభమైందో చూడటం.
భారతీయ stock exchanges అయిన NSE మరియు BSE ల్లో 5000 కంటే ఎక్కువ కంపెనీలు ఉన్నా,
నేను మాత్రం long-term investment point of view లో ప్రతిరోజూ selective గా చూసే stocks ఐదు లేదా ఆరు మాత్రమే ఉంటాయి.
అందులో మొదటి stock వచ్చి State Bank of India.
దాని తర్వాత Tata Consultancy Services, Infosys, Wipro వంటి IT companies… ఆ తర్వాత కొన్ని pharmaceutical companies…
ఇంకా మరికొన్ని కంపెనీలు ఉంటాయి.
మొన్న శుక్రవారం ఉదయం, bank లో computer login అవ్వగానే ఎప్పటిలాగే share prices ఎలా ఉన్నాయో చూడటం జరిగింది.
ఆ రోజు SBI share price సుమారు ₹ 1090 వద్ద trade అవుతూ ప్రారంభమైంది.
అది చూసాక, కాసేపటికే నా counter కి customers రావడం మొదలవడంతో నా పనిలో busy అయిపోయాను.
తిరిగి మధ్యాహ్నం lunch time లో market check చేద్దాం అనుకుని చూసేసరికి…
ఉదయం ₹ 1090 వద్ద ఉన్న SBI share, మధ్యాహ్నానికి ₹ 1020 కంటే దిగువకు పడిపోవడం చూశాను.
ఒక్కసారిగా “ఏమైంది SBI share కి? ఎందుకు ఇలా పడిపోయింది?”
అనే ప్రశ్న నా లోపల మొదలైంది.
నేను follow చేసే మిగతా stocks కూడా చూసాను.
వాటిలో SBI stock లా పెద్దగా ఎలాంటి fall కనిపించలేదు.
“SBI share price పడడానికి ఏదో ఒక కారణం ఉంటుందిలే…” అనుకుని అప్పటికి shares గురించిన ఆలోచన వదిలేశాను.
ఆ రోజు సాయంత్రం bank లో నా colleague సురేంద్ర అన్నతో మాట్లాడాకే SBI share price ఎందుకు sudden గా పడిపోయిందో అసలు కారణం తెలిసింది.
ఆ రోజు మధ్యాహ్నమే SBI chairman 2025–26 ఆర్థిక సంవత్సర ఫలితాలను ప్రకటించారు.
ఆ results బయటకు వచ్చిన వెంటనే SBI share price సుమారు 7% వరకు పడిపోయింది.
అంటే ₹ 1090 వద్ద ఉన్న share, ₹ 1019 వరకు పడిపోయింది.
సాధారణంగా stock market విషయానికి వస్తే…
ఒక కంపెనీ profit ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటే, ఆ company share price కూడా పెరగడం చూస్తూనే ఉంటాం.
కానీ నాకు అర్థం కాని విషయం ఏమిటంటే…
SBI ఈసారి తన చరిత్రలోనే తొలిసారిగా ₹ 80,000 కోట్లను దాటిన net profit ను ప్రకటించింది.
2024–25 ఆర్థిక సంవత్సరంలో సుమారు ₹ 70,000 కోట్లుగా ఉన్న లాభం,
ఇప్పుడు ₹80,032 కోట్లకు పెరిగింది.
దాదాపు 13% net profit పెరిగినా కూడా share price ఎందుకు పడిపోయిందనే సందేహం నా లోపల మొదలైంది.
---
2026 మార్చి 31 నాటికి State Bank of India లో savings accounts మరియు fixed deposits కలిపి సుమారు ₹ 59,75,642 కోట్ల deposits ఉన్నాయి.
అందులో సుమారు ₹ 49,32,627 కోట్లను వివిధ రకాల loans గా ఇచ్చారు.
ఆ loans ద్వారా వచ్చిన interest income నుంచి, deposit చేసిన customers కి ఇవ్వాల్సిన interest తీసేస్తే
మిగిలేది Net Interest Income.
ఈ సంవత్సరం SBI యొక్క Net Interest Income సుమారు ₹ 1,73,120 కోట్ల రూపాయలు.
దానికి అదనంగా non-interest income సుమారు ₹ 73,444 కోట్లు.
ఈ రెండింటిని కలిపితే,
2025–26 ఆర్థిక సంవత్సరంలో State Bank of India యొక్క మొత్తం revenue సుమారు ₹ 2,46,564 కోట్లకు చేరుకుంది.
కానీ ఆ revenue మొత్తం profit కాదు.
దాంట్లో నుంచి… దాదాపు 2.5 లక్షల మంది SBI ఉద్యోగుల జీతాలు,
దేశవ్యాప్తంగా ఉన్న 25,000 కంటే ఎక్కువ SBI branches కి rent,
current bills, stationery expenses, technology maintenance,
మరెన్నో operational మరియు overhead expenditures… ఇవి అన్నీ కలిపి
సుమారు ₹1,20,000 కోట్లకు పైగానే ఖర్చవుతోంది.
దాని తర్వాత ప్రభుత్వానికి taxes కూడా చెల్లించాలి.
పైన చెప్పిన ఖర్చులన్నీ మొత్తం revenue నుంచి తీసేసిన తర్వాత మిగిలిందే 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన
SBI యొక్క ₹ 80,032 కోట్ల net profit.
ఈ స్థాయిలో net profit ఇప్పటివరకు భారతదేశంలో మరే బ్యాంకుకీ రాలేదు.
SBI కి కూడా ఇదే మొదటిసారి.
---
2020–21 : ₹ 20,410 కోట్లు
2021–22 : ₹ 31,676 కోట్లు
2022–23 : ₹ 50,232 కోట్లు
2023–24 : ₹ 61,077 కోట్లు
2024–25 : ₹ 70,901 కోట్లు
2025–26 : ₹ 80,032 కోట్లు
ప్రతి సంవత్సరం profit పెరుగుతూనే ఉంది.
అయినా కూడా… శుక్రవారం 2025–26 financial results ప్రకటించిన రోజే
SBI share price పడిపోయింది.
Overall గా చూస్తే net profit చాలా బాగానే వచ్చింది.
అయితే ఎందుకు share price తగ్గింది?
నాకు ఇప్పటికీ పూర్తిగా అర్థం కాలేదు.
బహుశా market ఇప్పటికే ఈ profits ను ముందుగానే expect చేసి ఉండొచ్చు.
లేదా పెద్ద investors profit booking చేసి ఉండొచ్చు.
లేదా future growth గురించి market కి ఏదైనా భయం ఉండొచ్చు.
అసలు కారణం ఏదైనా కావచ్చు…
కానీ ఇప్పుడు నా ఆలోచన అంతా రేపు ఉదయం market open అయిన తర్వాత SBI stock price ఎలా move అవుతుందన్న దానిపైనే ఉంది.
SBI share price మళ్లీ పైకి వెళ్తుందా?
లేక ఇంకా కొంచెం దిగుతుందా?
దిగితే… ఎంతవరకు దిగుతుందో చూసి దాన్ని ఒక మంచి buying opportunity గానే చూడాలి అనుకుంటున్నాను 🙂
— తిరుపతి మహేష్
10/05/2026
Comments
Post a Comment