ఆస్తి వచ్చింది… కానీ మనశ్శాంతి మాత్రం…

తిరుపతిలో నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది.

మూడేళ్ల క్రితం తనకి 23 ఏళ్లు కూడా నిండలేదు.

ఇంట్లో వాళ్లు “మంచి సంబంధం వచ్చింది” అని చెప్పి, వచ్చిన పెళ్లి సంబంధానికి ఆమె పెళ్లి చేసేశారు.

ఆమె ఒక private bank లో నెలకు ₹25,000 జీతంతో పని చేస్తోంది.

ఆమె భర్త Tech Mahindra లోనా, లేక Tata Consultancy లోనా పని చేస్తున్నాడో నాకు సరిగ్గా తెలియదు. ప్రస్తుతం Work From Home ఉండడంతో తిరుపతి నుంచి 35 km దూరంలో ఉన్న శ్రీకాళహస్తిలో వాళ్ల సొంత ఊరిలో ఉంటున్నారు.

ఆ అమ్మాయి మాత్రం రోజూ తిరుపతికి వచ్చి వెళ్తోంది.

సంవత్సరం క్రితం వారికి ఒక బాబు పుట్టాడు.

ఊరిలో ఉండడానికి ఇప్పటికే రెండు ఇళ్లు ఉన్నా కూడా, “కొడుకు future కోసం” అని అనుకుని కొన్ని రోజుల క్రితం తిరుపతిలో 20 అంకణాల్లో ₹30 లక్షలకు ఒక ఇల్లు కొనారు.

అది కూడా…

₹16 లక్షలు Personal Loan తీసుకుని,

ఇంట్లో ఉన్న మొత్తం బంగారం బ్యాంకులో పెట్టి మరో ₹14 లక్షలు Gold Loan తీసుకుని…

మొత్తం ₹30 లక్షలు చేసి ఇల్లు కొనేశారట.

ఇప్పుడు ఆ ఇంటికి నెలకు ₹6,000 అద్దె వస్తోందట.

తిరుపతిలో ఏదో స్థలం అయినా, లేక ఇల్లు అయినా ఉండాలని అనుకుని…

 తంటాలు పడి, చివరికి ఏదో ఒక చోట ఇల్లు కొనారు.

రెండు నెలలుగా Personal Loan EMI కడుతున్నారు.

ఇప్పుడు ₹30 లక్షల అప్పు ఒక పెద్ద భారం లాగా అనిపిస్తోందట.

అప్పు గురించి ఆలోచిస్తే భయం వేస్తోందట.

₹16 లక్షల Personal Loan ను 6 సంవత్సరాలకు పెట్టారట.

దానికి నెలకు దాదాపు ₹30,000 EMI.

“నా భర్త జీతం వచ్చిన వెంటనే అందులో సగం EMIకే వెళ్లిపోతోంది” అని చెప్పింది.

మిగిలిన ₹14 లక్షల Gold Loan ఎలా అయినా త్వరగా తీర్చేయాలని అనుకుంటున్నానని చెప్పింది.

వాళ్ల నెల ఖర్చుల గురించి అన్నీ అడిగి తెలుసుకున్నాక…

“EMI కాకుండా ఇంకో ₹30,000 Gold Loan కోసం ప్రతి నెల కట్టగలిగితే, ఐదు సంవత్సరాల్లో అప్పు మొత్తం తీరిపోతుంది” అని చెప్పాను.

అది విన్నాక కొద్దిసేపు silent అయిపోయింది.

ఇంకా విషయం ఏంటంటే…

వాళ్లు ప్రతి నెల ₹10,000 SIP కూడా కడుతున్నారట.

మొదట ఆ SIP ఆపేయమని చెప్పాను.

“ఎందుకు?” అని అడిగింది.

ఇప్పటికే ఇంత పెద్ద అప్పు ఉండగా, మరోవైపు SIP లో investment చేయడం నాకు పూర్తిగా foolishness లాగా అనిపించింది.

అదే డబ్బు Gold Loan కి కడితే, కనీసం అప్పు కొంచెమైనా త్వరగా తగ్గుతుంది కదా అని చెప్పాను.

“ఇల్లు అనేది ఇప్పటికే మీ కొడుకు future కోసం చేసిన investment.

ఇంకా SIP పేరుతో మరో investment ఎందుకు?

ముందు ఇల్లు కోసం చేసిన అప్పు తీర్చండి” అని చెప్పాను.

నేను చెప్పింది కాసేపు ఆలోచించి…

“అవును… నువ్వు చెప్పింది correctే” అని చెప్పి, “ఆలోచిస్తాను” అంటూ call cut చేసింది.

---

సాధారణంగా మనుషులకు ఆస్తి మీద ఎందుకు అంత మమకారం ఉంటుందో నాకు అసలు అర్థం కాలేదు.

నేను చూసినంతవరకు…

చాలామంది జీవితాంతం కష్టపడి సంపాదించిన ఆస్తి, అవసర సమయంలో వారికి అసలు ఉపయోగపడటమే లేదు.

Paper మీద మరియు సమాజంలో “ఆస్తిపరుడు” అనే పేరు ఉండొచ్చు.

కానీ నిజ జీవితంలో…

బాగా ఆస్తి ఉండి,

ఇతరులు ఈర్ష్యపడేంత సంపాదించినా…

నిజానికి కొంతమంది ఆస్తిపరులు, పైకి కనిపించకపోయినా లోలోపల

బిచ్చగాళ్ల జీవితమే గడుపుతున్నారు.

మంచి పోషకాహారం తినక, ఆరోగ్యం గురించి పట్టించుకోక, తమ ఆస్తిని చూసుకుంటూ మురిసిపోతూ…

తమకే తెలియకుండా, తమకు ఉన్న ఏకైక ఒక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.

కేవలం ఆస్తి కూడబెట్టుకునే ప్రయత్నంలో తమ అమూల్యమైన జీవితాన్నే కోల్పోతున్నారు అనిపిస్తుంది.

మీరు ఏమనుకుంటున్నారు?

మీ అభిప్రాయాన్ని Comment Box లో చెప్పండి.

— తిరుపతి మహేష్

06/05/2026 

Comments

Post a Comment

Popular posts from this blog

మీతో పంచుకోవాలనుకున్న ఒక సంతోషకరమైన విషయం…... Welcome to My...

తప్పు ఎవరిదైనా… చివరికి నష్టపోయేది మాత్రం...

ఒక తండ్రి మనసు…

Happy Birthday to My Dear…... ❤️

రెండు సంవత్సరాల క్రితం… సరిగ్గా ఈ రోజు: మేము ఇల్లు మారిన కథ

అగ్నిపరీక్ష

వెనక్కి వెళ్లిన అడుగులు… మళ్లీ మేల్కొన్న జ్ఞాపకాలు...

దీక్ష భగ్నం అయింది… My Lord!

ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబం… ఇంకా ఉన్నాయా?

ఒక అమ్మాయి అడిగిన ప్రశ్న