కిరిటిమాటి నుంచి హవాయి వరకు...

ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 వచ్చేసరికి,

“ప్రపంచంలో ముందుగా ఏ దేశం నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తుంది?” అనే ఆలోచన తప్పకుండా నాకు వస్తుంటుంది.

ఆ సమయంలో ఇంటర్నెట్‌లో చూసి సమాధానం తెలుసుకుంటాను.

కానీ ఆశ్చర్యంగా ఏమిటంటే… తర్వాతి సంవత్సరం చివరికి మళ్లీ అదే ప్రశ్న వచ్చినప్పుడు, అది ఒకే సమాధానం అయినప్పటికీ,

ప్రతి సారి నేను దానిని మర్చిపోతుంటాను 🙂

ఈ రోజు 2025 సంవత్సరం చివరి రోజు.

ఉదయం లేచిన వెంటనే, ఎప్పటిలాగే అదే సందేహం వచ్చింది. ఈసారి ChatGPT ని అడిగాను.

అప్పుడు తెలిసింది — ప్రపంచంలో ముందుగా నూతన సంవత్సరాన్ని ఆహ్వానించే దేశం Kiribati అని.

---

14 చిన్న చిన్న దీవులతో ఏర్పడిన, ఆస్ట్రేలియా ఖండంలో ఉన్న ఒక చిన్న దీవి దేశమే ఈ కిరిబాటి.

ఆ దేశంలో ఉన్న Kiritimati అనే దీవిని “క్రిస్మస్ ఐలాండ్” అని కూడా పిలుస్తారు.

ఇదే ప్రపంచంలో మొదటిగా కొత్త సంవత్సరాన్ని స్వాగతించే ప్రదేశం.

దానికి కారణం — ప్రపంచంలోనే ముందున్న టైమ్ జోన్‌లో ఇది ఉండటమే.

మన భారత కాలమానం ప్రకారం, ఈ రోజు సాయంత్రం 3:30 గంటలకే అక్కడ అర్ధరాత్రి 12 గంటలు అవుతుంది.

అంటే మనకంటే సుమారు 8½ గంటల ముందుంది.

పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఉన్న ఈ ప్రశాంత దీవి,

మన చెన్నై, హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలతో పోలిస్తే చాలా చిన్నది.

ఒక బాధాకరమైన విషయం ఈ దీవి గురించి ఏమిటంటే…

కేవలం 7 వేల జనాభా ఉన్న ఈ ప్రాంతం,

Global Warming మరియు Climate Change కారణంగా, సముద్ర మట్టం పెరుగుదల వల్ల

మెల్లగా మాయమవుతున్న దీవుల జాబితాలో ముందుంది.

---

కిరిటిమాటి తర్వాత,

మన సమయం ప్రకారం సాయంత్రం 4:30కి న్యూజిలాండ్‌లోని Auckland, Christchurch నగరాలు అద్భుతమైన ఫైర్‌వర్క్స్‌తో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తాయి.

ఆ తర్వాత క్రమంగా:

సాయంత్రం 6:30 — ఆస్ట్రేలియాలోని Sydney, Melbourne

రాత్రి 8:30 — జపాన్, కొరియా

రాత్రి 9:30 — ఫిలిప్పీన్స్, సింగపూర్, హాంకాంగ్

రాత్రి 10:30 — థాయిలాండ్ (బ్యాంకాక్)

ఈ దేశాలు అన్నీ కొత్త సంవత్సరాన్ని జరుపుకున్న తర్వాతే,

మన భారత్‌లో అర్ధరాత్రి 12 గంటలకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది 🙂

మన తర్వాత గల్ఫ్ దేశాలు — దుబాయ్, మస్కట్, ఖతార్.

ఆ తర్వాత ఆఫ్రికా…

తర్వాత యూరప్ దేశాలు…

అలా ఒక్కొక్కటిగా ప్రపంచం మొత్తం కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తుంది.

అందరూ జరుపుకున్న తర్వాత,

మన సమయం ప్రకారం జనవరి 1, ఉదయం 10:30కి

అమెరికాలోని New York City లో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది.

మధ్యాహ్నం 1:30కి

Los Angeles, San Francisco వంటి పశ్చిమ తీర నగరాలు కూడా ఆహ్వానిస్తాయి.

ఇంకా చివరగా…

పసిఫిక్ మహాసముద్రంలో అమెరికాకు చాలా దూరంగా ఉన్న

అమెరికా రాష్ట్రం Hawaiiలో

మన సమయం ప్రకారం సాయంత్రం 3:30కి

ప్రపంచంలో చివరిగా కొత్త సంవత్సరం వస్తుంది.

ఆ సమయానికి కిరిటిమాటిలో మాత్రం…

జనవరి 2 అర్ధరాత్రి!

అంటే కిరిటిమాటి మరియు హవాయి మధ్య

సరిగ్గా 24 గంటల తేడా ఉంది.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే —

ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం కేవలం 3000 కిలోమీటర్లు మాత్రమే!

ఈ ఆసక్తికరమైన సమాచారం తో,

మీ అందరికీ ముందుగానే

హ్యాపీ న్యూ ఇయర్ – 2026 శుభాకాంక్షలు 🎉

కొత్త సంవత్సరంలో మారేది కేవలం కాలెండర్ మాత్రమే…

మన సమస్యలు, ఆలోచనలు, బాధలు, సవాళ్లు

అలానే ఉండిపోతాయి.

కానీ మన మనసును మాత్రం ఎప్పుడూ నిరుత్సాహపడనివ్వకూడదు.

కొత్త ఉత్సాహంతో, కొత్త ఆశతో

కొత్త సంవత్సరంలో మనందరం ముందుకు సాగాలి అని

మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

---

తిరుపతి మహేష్

31/12/2025

Comments

Popular posts from this blog

మీతో పంచుకోవాలనుకున్న ఒక సంతోషకరమైన విషయం…... Welcome to My...

తప్పు ఎవరిదైనా… చివరికి నష్టపోయేది మాత్రం...

ఒక తండ్రి మనసు…

Happy Birthday to My Dear…... ❤️

రెండు సంవత్సరాల క్రితం… సరిగ్గా ఈ రోజు: మేము ఇల్లు మారిన కథ

అగ్నిపరీక్ష

వెనక్కి వెళ్లిన అడుగులు… మళ్లీ మేల్కొన్న జ్ఞాపకాలు...

దీక్ష భగ్నం అయింది… My Lord!

ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబం… ఇంకా ఉన్నాయా?

ఒక అమ్మాయి అడిగిన ప్రశ్న